Amitabh Bachchan: సినీ పరిశ్రమలో సెలబ్రిటీల ఆస్తుల వివరాలు తెలిస్తే ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పదు. మామూలుగా ఇలాంటి వివరాలు పెద్దగా బయటికి రావు కానీ కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు చేసే సర్వేల వల్ల బయటికి రాక తప్పదు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ఫైనాన్షియల్ వివరాలు కూడా అలాగే బయటికొచ్చాయి. 2024-25లో అమితాబ్ ఎన్ని కోట్లు సంపాదించారు, దాంట్లో ఎన్ని కోట్లు ట్యాక్స్ కట్టారు అనే విషయాన్ని ఒక ప్రముఖ మ్యాగజిన్ ప్రచురించింది. అందులో ఉన్న సంఖ్యలు చూసి బీ టౌన్ ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పడం లేదు. ఒక్క ఏడాదిలోనే అమితాబ్ ఏకంగా రూ.120 కోట్ల ట్యాక్స్ కట్టారని సమాచారం.
కొత్త రికార్డ్
రూ.120 కోట్ల ట్యాక్స్ కట్టడంతో ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టినవారిలో అమితాబ్ బచ్చన్ పేరు కూడా నిలిచింది. సినీ పరిశ్రమలో అత్యధిక సంపాదన ఉన్న సెలబ్రిటీ కూడా ఆయనే. అమితాబ్ బచ్చన్‌కు ప్రస్తుతం 82 ఏళ్లు. అయినా కూడా ఇంకా తమ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద సంస్థలు సైతం ఆయననే సంప్రదిస్తూ ఉంటారు. బ్రాండ్ ప్రమోషన్స్, సినిమాలు, బుల్లితెర ప్రోగ్రామ్స్, కౌన్ బనేగా కరోడ్ పతీ.. ఇలా అన్నింటిలో అమితాబ్ డామినేషన్ ఇప్పటికీ కనిపిస్తుంది. అందుకే ఒక్క ఏడాదిలోనే అత్యధిక సంపాదనతో పాటు అత్యధిక ట్యాక్స్ కట్టిన బాలీవుడ్ ఆర్టిస్ట్‌గా అమితాబ్ పేరుపై రికార్డ్ క్రియేట్ చేసింది.
అత్యధిక సంపాదన
‘ఇండియాలోని కొన్ని అతిపెద్ద ఫీచర్ ఫిల్మ్స్‌లో నటించడం దగ్గర నుండి టాప్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసేవరకు అమితాబ్ బచ్చన్‌కు 82వ ఏట కూడా డిమాండ్ ఉంది. ఆయన కౌన్ బనేగా కరోడ్ పతీతో అందరికీ ఇష్టమైన హోస్ట్ అయిపోయారు. ఇలా వీటన్నింటితో కలిపి ఆయన ఒక్క ఏడాదిలోనే రూ.350 కోట్లు సంపాదించినట్టు సమాచారం. సినీ పరిశ్రమలోనే ఇంత సంపాదన ఎవ్వరికీ లేదు’ అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం సాగిస్తోంది. 2025 మార్చి 15న అమితాబ్ బచ్చన్ రూ.52.50 కోట్ల ట్యాక్స్ కట్టారని కూడా తెలిపింది. ఎంత సంపాదిస్తున్నారో పక్కన పెడితే ఒక బాధ్యత ఉన్న ఇండియన్‌గా ఆయన అంత ట్యాక్స్ కట్టడం మంచి విషయమని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
Also Read: వాళ్ల సిల్లీ ఆస్కార్ వాళ్ల దగ్గరే ఉండనివ్వు.. కంగనా షాకింగ్ కామెంట్స్
కోట్లలో ఆస్తులు
2025లో కూడా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పలు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొన్నాళ్ల క్రితం అమితాబ్ ఆస్తుల విలువ రూ.270 కోట్లకు పైనే ఉంటుందని కూడా బీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో పాటు ఆయన వద్ద రూ.54.77 కోట్ల విలువ చేసే బంగారం కూడా ఉందట. రూ.17.66 కోట్ల విలువ చేసే వాహనాలు కూడా ఆయన పేరుపైనే ఉన్నాయని సమాచారం. 82 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ మరీ సంపాదనలో దూసుకుపోతున్నారు అమితాబ్ బచ్చన్. ఒక్క ఏడాదిలోనే రూ.350 కోట్లు సంపాదించి.. రూ.120 కోట్ల ట్యాక్స్ కట్టిన ఇండియన్ సినీ సెలబ్రిటీగా అమితాబ్ పేరు మీద కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది.