Medak Crime News: కోటి ఆశలతో అత్తింటిలో అడుగు పెట్టింది. నవ వధువు. తన జీవితం అంతా భర్త, అత్తమామలే అని భావించింది. అత్తింట్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలకు విరక్తి చెందిందా? ప్లాన్ ప్రకారం భర్తతో కలిసి అత్తమామలు చంపేశారా? అనేది తెలీదు. చివరకు ఈ లోకాన్ని విడిచిపెట్టేసింది నవ వధువు. ఇంతకీ విషయం ఏంటి? వివరాలు ఎక్కడ అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.
పెళ్లయిన మూడు నెలలకే
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారానికి చెందిన మహేష్- 24 ఏళ్ల పూజాకు పెళ్లి అయ్యింది. వివాహం సందర్భంగా అల్లుడికి ఇవాల్సిన లాంఛనాలు అన్నీ ఇచ్చేశారు. దీంతో తమ కూతురు జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుందని యువతి తల్లిదండ్రులు భావించారు. అన్నట్లుగా కోటి ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టింది పూజ.
సీన్ కట్ కంటే.. శనివారం రాత్రి పూజ అత్తింటిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే పూజ తల్లిదండ్రులు, బంధువులు ఎకఎకీన అల్లుడికి ఇంటికి వచ్చారు. కూతురు పూజ ఈలోకంలో లేదని తెలుసుకుని ఆవేశానికి లోనయ్యాడు. కన్నీరు మున్నీరు అయ్యారు. ఆపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ కూతురు మృతి వెనుక అల్లుడు, అత్తమామలు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
అల్లుడి ఇంటిపై దాడి
ఈలోగా ఇరుగు పొరుగు మాటలతో రెచ్చిపోయారు. అల్లుడు మహేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు పూజ బంధువులు. అడ్డుకోబోయిన పోలీసులు, చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు, గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ALSO READ: మధుమిత చివరిగా ఏం చెప్పిందంటే.. ఫోన్‌లో కీలక ఆధారాలు
పూజ బంధువులు, పేరెంట్స్.. అల్లుడి ఇంటికిపై దాడి చేయడం వెనుక ఏదో కారణం ఉంటుందని అంటున్నారు. మహేష్ ఫ్యామిలీ గురించి కీలక విషయాలు తల్లిదండ్రులకు పూజ చెప్పి ఉంటుందని అంటున్నారు. లేకుంటే కూతురు పోయినబాధలో ఉన్నవారు దాడి చేయడమేంటనేది అసలు ప్రశ్న. పూజ ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.