BigTV English

Japanese Restaurant: ఇదెక్కడి రెస్టారెంట్ రా బాబు.. వాళ్లు పిలిస్తేనే వెళ్ళాలా.. మనం వెళ్లకూడదా?

Japanese Restaurant: ఇదెక్కడి రెస్టారెంట్ రా బాబు.. వాళ్లు పిలిస్తేనే వెళ్ళాలా.. మనం వెళ్లకూడదా?

Japanese Restaurant: జపాన్ రెస్టారెంట్ సంస్కృతి నిజంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. కస్టమర్ల కోసం ఎప్పుడూ పోటీ పడే హోటళ్లు.. మంచి వంటకాలు పెట్టి రివ్యూలలో స్టార్‌లు సంపాదించుకోవాలని ఆశపడే వారు. కానీ జపాన్‌లోని ఒక రెస్టారెంట్ మాత్రం ఈ రీతిలో కాకుండా, పూర్తి భిన్నంగా నడుస్తున్నాయి. వీటికి ప్రచారం, రేటింగ్ ఏజెన్సీల రివ్యూలు, లేదా సోషల్ మీడియా హైప్ అన్నవి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే కస్టమర్లు వారిని ఎంచుకోరు.. వారు కస్టమర్లను ఎంచుకుంటారు. ఈ వార్త వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, మీరు విన్నది నిజమే. ఆ రెస్టారెంట్‌‌‌లో అంత ప్రత్యేకత ఏమిటో చూద్దాం.


సుగలాబో రెస్టారెంట్.. వారు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి

జపాన్ టోక్యో నగరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన రెస్టారెంట్ సుగలాబో ఈ రూల్స్ తో నడిపిస్తున్నారు. దీన్ని యోసుకె సుగా అనే చెఫ్ ప్రారంభించారు. ఆయన ఆలోచన ఏమిటంటే, రెస్టారెంట్ అనే ప్రదేశం కేవలం తినిపించే స్థలం మాత్రమే కాదు, ఒక ప్రత్యేక అనుభవాన్ని పంచే ప్రదేశం కావాలి. అందుకే ఆయన తన రెస్టారెంట్‌ని అందరికీ తెరవకుండా, కేవలం వానే ఎంచుకున్న వారికి మాత్రమే ఆహ్వానం ఇస్తారు.


ప్రైవేట్ ఫోన్ నెంబర్

ఈ రెస్టారెంట్‌కు ఒక ప్రైవేట్ ఫోన్ నంబరు ఉంటుంది. కానీ ఆ నంబరు కూడా ఎవరికి దొరకదు. ఎవరికైతే ఆహ్వానం చేయాలని అనుకుంటారో వారికి మాత్రమే తెలియజేస్తారు. రెస్టారెంట్ తెరవబడే సమయాలు కూడా రహస్యంగానే ఉంటాయి. ఈ రెస్టారెంట్ ఎప్పుడూ ఓపెన్, క్లోజ్ ఎప్పుడూ అనేది ఎవ్వరికీ తెలియదు. యజమాని నిర్ణయించిన ప్రత్యేక సమయంలో మాత్రమే పనిచేస్తుంది.
మరొక విషయం ఏమిటంటే.. కస్టమర్లను రెస్టారెంట్‌కి పిలిచేది కూడా ఈ రెస్టారెంట్ యజమాన్యమే. స్వయంగా యజమానే ఆయనే కాల్ చేసి.. ఫలానా సమయానికి రండి అని చెబుతారు. మరీ మహా అయితే, పాత కస్టమర్లు తమకు తెలిసిన కొత్త వారిని రిఫర్ చేయవచ్చు. కానీ ఆ కొత్త వారిని మళ్లీ పిలవాలా వద్దా అనేది మాత్రం పూర్తిగా యజమాని ఇష్టమే.

ఇది రెస్టారెంట్ కాదా.. క్లబ్ ఆ..?

ఈ రెస్టారెంట్‌ను చూసినప్పుడు ఇది సాధారణ రెస్టారెంట్ కాకుండా, ఒక క్లబ్‌లా అనిపిస్తుంది. కానీ అసలు ప్రత్యేకత వంటకాలలోనే ఉంటుంది. యోసుకె సుగా తయారు చేసే వంటకాలు అంత సింపుల్‌గా ఉండవు. ప్రతి వంటకానికి జపాన్ సాంప్రదాయం, ఆధునిక శైలి, సీజనల్ పదార్థాలు అన్నీ కలిపి వంటకాల తయారీ ఉంటుందట. ఈ రెస్టారెంట్‌‌కు వెళ్లి తిన్న అనుభవం ఒక రకంగా చెప్పాలంటే, ఆహారం అనేది పేరుకు మాత్రమే, అక్కడ రెస్టారెంట్ పేరుతో ప్రయాణంలా ఉంటుంది.

Also Read: Jio Data Offer: జియో సంచలన ఆఫర్.. రూ.11 తో 10GB డేటా ప్లాన్ పూర్తి వివరాలు ఇదిగో!

ఈ రెస్టారెంట్‌కు రివ్వూ అవసరం లేదా?

ఈ రహస్య రెస్టారెంట్‌కు రివ్యూలు ఎందుకు వద్దని అంటారు అంటే.. సాధారణంగా రెస్టారెంట్లు రేటింగ్‌లు పెంచుకోవడం కోసం ప్రత్యేకంగా ప్రయత్నిస్తాయి. స్టార్ రివ్యూలు వస్తే మరిన్ని కస్టమర్లు వస్తారు, బిజినెస్ పెరుగుతుంది. కానీ సుగలాబో మాత్రం ఈ మార్గంలో నడవడం ఇష్టంలేదు. ఎందుకంటే వారి కోసం కస్టమర్ల సంఖ్య కంటే, కస్టమర్లతో ఉన్న అనుబంధమే ముఖ్యంగా భావించారు.

ఈ రెస్టారెంట్ ఆహ్వానం గౌరవంగా భావిస్తారు

వాస్తవానికి ఈ రెస్టారెంట్ ఆహ్వానం పొందడం అనేది ఒక గౌరవంగా భావిస్తారు. ఎందుకంటే అందరికీ లభించని అవకాశం అది. అక్కడికి వెళ్ళే వారికి వంటకాల రుచి మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది. ఇలాంటివి జపాన్ సంస్కృతిలో హిడెన్ రెస్టారెంట్లు లేదా ఇన్విటేషన్ ఓన్లీ అనే పేర్లతో గుర్తింపు పొందాయి. వీటిలోకి అడుగుపెట్టడం అనేది అదృష్టంగా భావిస్తారు. బయట ప్రపంచం వీటి గురించి ఎక్కువగా తెలియకపోవడం కూడా వాటి ప్రత్యేకత.

మిస్టరీ రెస్టారెంట్

టోక్యోలోని సుగలాబో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీ రెస్టారెంట్‌గా పేరొందింది. ఇక్కడికి రావాలంటే డబ్బు, రివ్యూలు, లేదా ప్రాచుర్యం ఏమాత్రం పనికిరాదు. యజమాని మనల్ని పిలిస్తేనే ఆ అదృష్టం కలుగుతుంది. ఇలా చూసినప్పుడు.. జపాన్ రెస్టారెంట్ సంస్కృతిలో ఎంత వైవిధ్యం ఉందో అర్థమవుతుంది. మన దగ్గర రెస్టారెంట్లు కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటే, అక్కడ కొన్ని ప్రత్యేకమైన చోట్ల మాత్రం కస్టమర్లను ఎంచుకోవడమే ప్రధాన విధానం. ఇది నిజంగా ఆశ్చర్యకరం కదా?

Related News

India USA: మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్! ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే..

Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 60 మంది మృతి, చెట్టును ఢీ కొనడం వల్లే..

Greece Population: గ్రీస్ లో జనాభా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Big Stories

×