Komuram Bheem District: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. వాంకిడి మండలం గోయిగాం డాబా గ్రామంలో ప్రమాదవశాత్తూ నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు కూతుర్లు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా..? లేకుంటే ప్రమాదవశాత్తూ మడుగులో పడి చనిపోయారా..? లేదా ఎవరైనా చంపి మడుగులు పడేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.