Medak News:మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబందానికి అడ్డు వస్తుందని రెండేళ్ల చిన్నారిని కడతేర్చింది ఓ కన్న తల్లి. శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామాని చెందిన మమతకు అదే గ్రామంలోని ఓ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబందం కొనసాగిస్తుంది. అంతేకాక తన పాపతో పాటు ఆ యువకునితో పారి పోయింది. తన కూతురు, మనుమరాలు కనబడటం లేదని మమత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు . ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పాపను చంపి పూడ్చి పెట్టినట్టు పోలీసులు తెలిపారు. పాపను పూడ్చిన స్థలంలో తవ్వకాలు చేపట్టి డెడ్‌బాడీని వెలికి తీశారు పోలీసులు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు..
మెదక్ జిల్లాకు చెందిన మమతకు సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు తన్విసి ఉన్నారు. అయితే, మమత తన గ్రామానికి చెందిన ఫయాజ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మార్చి నెలలో ఇద్దరూ కలిసి పారిపోయారు. పెద్దలు సర్ది చెప్పి మమతను అత్తగారింటికి తిరిగి పంపించారు. అయినప్పటికీ, ఆమెలో మార్పు రాకపోవడంతో మే నెలలో పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వచ్చింది. మే 21న కుమారుడిని తల్లిగారి ఇంట్లో వదిలేసి, కూతురు తన్విసిని తీసుకుని ఫయాజ్‌తో పారిపోయింది. ఇది మే 27 నుంచి కనిపించకుండా పోయినట్లు రికార్డు అయింది.
ప్రియుడి ఫయాజ్‌తో కలిసి మమత జంప్..
దీంతో మమత తండ్రి రాజు శివ్వంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో మమత ఫయాజ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో చిన్నారి లేకపోవడంతో నిలదీయగా, వారు తన్విసిని గొంతు పిసికి హత్య చేసి, గ్రామ శివారులోని ఒక వాగు దగ్గర పాతిపెట్టినట్లు అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోస్టుమార్టం నిర్వహించి, హత్యా కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Also Read: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
మానవత్వం మరిచిపోయి.. కన్న కూతురినే చంపిన కసాయి తల్లి
అయితే గతంలో కూడా ప్రియుడి కోసం భర్తలను హత్య చేసిన ఘటనలు చాలా ఉన్నాయి.. కానీ సొంత బిడ్డలను చంపడం అనేది మరింత దారుణం. మమత, ఫయాజ్‌లు తమ సంబంధానికి చిన్నారి అడ్డంకిగా భావించి ఈ అమానుష చర్యకు పాల్పడ్డారని తెలుస్తుంది. కానీ, ఎంత ప్రేమించిన అడ్డుగా ఉందని కన్నా కూతురిని చంపుకోవడం చాలా బాధకరం.. 9 నెలలు మోసి కన్న సొంత కూతురిని చంపుకుంది అంటే ఆ తల్లి ఎంత కసాయిది అయితే ఈ ఘటనకు ఒడిగడుతుంది అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటన స్థానికుల్లో కలకలం రేపింది, మానవత్వం మరచిపోయిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజం మేలుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.