BigTV English

Bengaluru airport: బెంగళూరు ఎయిర్‌పోర్టులో హత్య.. వివాహేతర సంబంధం.. తీగలాగితే..

Bengaluru airport: బెంగళూరు ఎయిర్‌పోర్టులో హత్య.. వివాహేతర సంబంధం.. తీగలాగితే..

Bengaluru airport:  అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి దంపతులు, నడిరోడ్డు మీదకు వస్తున్నారు. కోపానికి లోనై చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బెంగుళూరు ఎయిర్‌పోర్టులో జరిగిన హత్య వెనుక అక్రమ సంబంధాలే కారణమని తెలుస్తోంది.


బెంగుళూరు ఎయిర్‌పోర్టు టెర్నినల్ -1‌ లో ప్రయాణికులతో  బిజీగా ఉంది. బుధవారం సాయంత్రం కరెక్టుగా సమయం నాలుగు గంటలు దాటింది. రమేష్ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పని చేస్తున్న రామకృష్ణప్ప అనే యువకుడ్ని దారుణంగా హత్య చేశాడు. కాసేపు ఎయిర్‌పోర్టులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వెంటనే అలర్టయిన పోలీసులు హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

బెంగుళూరు ఎయిర్‌పోర్టు హత్య ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం. తమకూరు జిల్లా మధుగిరి ప్రాంతానికి చెందిన రమేష్‌కు పెళ్లైంది. రమేష్ దంపతులు హాయిగా ఉండేవారు. సాఫీగా సాగుతున్న వాళ్ల సంసారంలో చిన్న కుదుపు. సమస్యను రమేష్ దంపతులు కూర్చొని చర్చించుకోవాల్సింది పోయి.. ఎడముఖం పెడముఖంగా వ్యవహరించారు. దంపతుల మధ్య దూరం పెరిగింది. రోజురోజుకూ కోపం పెరుగుతోంది. కానీ తగ్గడం లేదు. ఎక్కడికి వెళ్లినా భార్య గురించే రమేష్ ఆలోచించేవాడు.


ALSO READ: నాపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదు : పూజా ఖేడ్కర్

కొద్దిరోజుల తర్వాత అసలు విషయం రమేష్‌కి తెలిసింది. తన భార్యకు రామకృష్ణప్ప అనే వ్యక్తితో కాస్త సరదగా ఉండడం గమనించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అనుమానించాడు. చివరకు వీరి మధ్య అక్రమ సంబంధం ఉందనే నిర్ణయానికి వచ్చేశాడు. అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యను ఏమనలేక.. రామకృష్ణప్పను టార్గెట్ చేశాడు. వాడ్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు అందుకు తగ్గట్టుగా ప్లాన్ ప్రిప్లేర్ చేసుకున్నాడు. రామకృష్ణప్ప బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.

బెంగుళూరు ఎయిర్‌పోర్టులో రామకృష్ణప్పను చంపితే తన పగ తీరుతుందని భావించాడు రమేష్. అందుకు తగ్గట్టుగా రమేష్ పదునైన ఆయుధాన్ని తన బ్యాగ్‌లో పెట్టుకుని ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. బీఎంటీసీ బస్సులో ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. టెర్మినల్ -1 వద్ద టాయిలెట్ ఉండే ప్రాంతానికి వచ్చాడు. రామకృష్ణప్ప అక్కడికి రాగానే తన బ్యాగ్ లోని కత్తి తీసుకుని గొంతు కోసి చంపేశాడు రమేష్. దీంతో కాసేపు ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితి.

బాధితుడు స్పాట్‌లో రక్తం కారుతూ మృతి చెందాడు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిందితుడు రమేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. హతుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ కారణంగానే హత్య చేసినట్టు రమేష్ చెప్పారు. తన మనసులో బరువు దించుకున్నాడు. విధి నిర్వహణలో ఉన్న వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

నిందితుడు రమేష్‌ని బెంగుళూరు పోలీసులు విచారిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆధారాలతో రమేష్ వైఫ్‌ని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రామకృష్ణప్ప హత్య గురించి తెలియగానే మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×