Minor Boy: యువత మత్తు వలయంలో చిక్కుకుంటోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలై.. క్రమంగా ఆ అలవాటు మాదక ద్రవ్యాల సేవనం వరకు ఇది దారితీస్తోంది. యువతపై డ్రగ్స్ ప్రభావం అధికంగా ఉంటోంది. పరిస్థితి విషమించే వరకు చాలామంది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల పలు కుటుంబాల వేదన వర్ణనాతీతంగా ఉంటోంది.
తాజాగా జగిత్యాల పట్టణంలోని.. ఓ వైన్ షాప్‌లో.. పట్టుమని 16 సంవత్సరాలు నిండని ఓ మైనర్ బాలుడు.. మద్యం సేవిస్తూ.. అదే మద్యం షాపులో కొద్దిసేపు వీరంగం సృష్టించి, అపస్మారక స్థితిలో పడిపోయాడు.
కాగా.. టీనేజ్ దాటాకా వచ్చే వయసు మార్పులతో.. యువతలో కొత్త ఆలోచనలు పుడుతున్నాయా..? సరికొత్త అనుభూతులు కావాల్సి వస్తున్నాయా.. ? అందరిని భయపెట్లేలా ఉంటున్నాయా..? అందుకోసం తల్లిదండ్రులకు రకరకాల మాటలు చెప్పి.. ఇంటి నుంచి బయటకు వెళుతున్నారు పిల్లలు. అక్కడికి వెళ్లాక అంతులేని మత్తులోకంలో విహరిస్తున్నారు. అదే వాళ్లకు అద్భుత, ఆనందంగా కనిపిస్తుంది. దీనికోసం చదువును పక్కన పెట్టి మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది. వారిపై ఆలోచనలు వస్తున్న మార్పులు ఏంటి?
మత్తు అంత బాగుంటుందా..? అందుకే మత్తు లోకంలో యువ ప్రపంచం విహరిస్తోందా..? అడ్డాల్లో అడ్డంగా ఊగిపోతోందా..? అడ్డూ ఆపు లేకుండా అంతులేని ఆనందం అంటూ.. విచ్చలవిడిగా మత్తులో జోగుతోందా? ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ లభిస్తుండడంతో వాటిని సేవించి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. పట్టణాల్లో కొన్ని మద్యం షాపులు నిబంధనలకు విరుద్దంగా మైనర్లకు మద్యం విక్రయిస్తున్నారు. షాపు యజమానులు మైనర్లకు మద్యం, సిగరేట్లు విక్రయించవద్దని.. వైన్స్‌ల ముందు అధికారులు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నా కూడా.. డబ్బుల సంపాదనే ధ్యేయంగా.. కొందరు వ్యాపారులు నిబంధనలను బెఖాతరు చేస్తున్నారు.
తల్లిదండ్రులే గుర్తించాలి
విద్యార్థులు పెడధోరణి పడుతున్న ఆరంభంలోనే గుర్తించగలిగితే పరిస్థితి చేయిదాటదు. గతానికి భిన్నంగా విపరీత ధోరణుల్ని ప్రదర్శించడం, బ్యాక్‌లాగ్స్ పెరిగిపోవడం, నిర్లిప్తంగా ఉన్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి అని సూచిస్తున్నారు. విద్యార్థుల చరవాణుల్లో వాట్సప్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, టెలీగ్రామ్‌లాంటి యాప్‌నలు నిత్యం పరిశీలన చేయాలి. సాధారణంగా ఇలాంటి సామాజిక మాధ్యమాల్లోనే డ్రగ్స్ కోసం.. సంభాషణలు సాగిస్తుంటారు.
Also Read: 100 అంతస్తుల సైజు.. 1,000 అణుబాంబుల శక్తి.. భూమిపైకి దూసుకొస్తున్న ముప్పు..!
చాటింగ్‌లో వీడ్, స్కోర్, స్టఫ్, యాసిడ్ పేపర్, ఓసీబీ, కోక్, ఎండీ, జాయింట్, స్టాష్, మాల్, ఖాష్, స్టోన్ర్, పెడ్లర్, దమ్, పాట్, క్రిస్టర్, బూమ్, డీపీ వంటి పదాలతో రహస్య సంభాషణ సాగిస్తున్నారు. ఈ పదాలు మీ పిల్లల ఛాటింగ్‌లో కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. చరవాణుల వాల్‌పేపర్లు, డెస్క్‌టాప్ పిక్చర్స్, స్క్రీన్‌సేవర్లలో పొగతో కూడిన బొమ్మలు, మల్టీకలర్ ఇమేజ్‌లుంటే అనుమానించాలి.