DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఓ దొంగ ఇంట్లోకి రావడంతో కలకలం రేపింది. ఓ బెడ్ రూంతో పాటు ఇంట్లో దాదాపు అరగంట పాటు తిరిగాడని ఇంటి మెయింటేనెన్స్ ఇంఛార్జి లక్ష్మణ్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56 లోని బీజేపీ ఎంపీ డీ కే.అరుణ ఇంటికి శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దొంగ వచ్చాడు. ప్రహారీగోడ దూకి దొంగ లోపలికి ప్రవేశించాడు. దొంగ వంట గది వద్ద ఉన్న కిటికీ తెరిచి ఇంట్లోకి దూరాడు. అయితే కిచెన్ దగ్గర సౌండ్ రావడంతో మేం మేల్కొన్నాం. దొంగ రెండు చేతులకు గ్లౌస్, ఫేస్ కు మాస్క్ వేసుకున్నారు’ అని ఆయన ఇంఛార్జి లక్ష్మణ్ తెలిపారు.
‘హాల్ తో పాటు ఓ బెడ్రూంలోకి దొంగ ప్రవేశించాడు. డబ్బులు కోసం ఇల్లంతా వెతికాడు. ఇంట్లో ఏది దొరకక పోవడంతో 30 నిమిషాల తర్వాత ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఆ టైంలో ఎంపీ డీకే అరుణ తమ సొంత జిల్లా పాలమూరు పర్యటనలో ఉన్నారు’ అని ఆయన చెప్పారు. ఆమె కూతురు ఇంట్లోనే ఉన్నా నిద్ర నుంచి మెలకువ రాకపోవడంతో దొంగ వచ్చిన విషయాన్ని ఎవరూ గమనించలేదని పోలీసులుకు చెప్పారు. అయితే పోలీసులు తెలిసిన వారే దొంగతనం చేసేందుకు ఇంట్లోకి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ డీకే అరుణ ఇంట్లో గతంలో పని చేసి మానేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Income Tax: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..