BigTV English

Nellore Bus Accident: నెల్లూరులో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే!!

Nellore Bus Accident: నెల్లూరులో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే!!
Bus Accident in Nellore District: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొట్టి ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. అయితే డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి చెన్నైకి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో ప్రమాద సమయంలో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

 


వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఆగి ఉన్న కంటైనర్ ని వెనుక నుంచి విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ కంటైనర్ ని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న డివైడర్ ని తగిలి బస్సు బోల్తా పడింది. ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు బాగం నుజ్జు నుజ్జు అవడంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు.

Also Read: దారుణం.. విడవకుండా విచక్షణారహితంగా.. అలా చేసి చంపేశాడు


ముందు భాగంలో ఉన్న ప్రయాణికులకు 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న కావలి ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఇక యాక్సిడెంట్ జరిగిన బస్సు రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో ఆ బస్సును క్లియర్ చేసేందుకు జాతీయ రహదారిపై అధికారులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఐదు కిలోమీటర్లమేర ట్రాఫిక్ ఆగిపోయింది.

అయితే ఇక్కడ అనేక సార్లు కావలి, ముసునూరు, సున్నపుబట్టి వద్ద అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అక్కడి స్థానికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతీయ రహదారిపై అనేక యాక్సిడెంట్లు జరుగుతున్న ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదని పోలీసులపై, అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×