BigTV English

Rajinikanth Coolie Movie: మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రజినీ మూవీలో విలన్‌గా టాలీవుడ్ మన్మథుడు నాగ్..!

Rajinikanth Coolie Movie: మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రజినీ మూవీలో విలన్‌గా టాలీవుడ్ మన్మథుడు నాగ్..!

Nagarjuna in Rajinikanth Coolie Movie(Today tollywood news): ప్రస్తుత సినిమాలన్నీ దాదాపుగా మల్టీస్టారర్‌గానే తెరకెక్కుతున్నాయి. క్రేజీ హీరోలను సినిమాల్లో పెట్టి మంచి హిట్లు కొడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య ఈ వ్యవహారం ఎక్కువైపోయింది. ఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. వీటికి బాగా రెస్పాన్స్ రావడంతో అదే బాటలో ఇతర దర్శకులు పయణిస్తున్నారు. ఇప్పటికీ టాలీవుడ్‌లో చాలా సినిమాలు అదే ఫార్మెట్‌లో వచ్చాయి. అందులోనూ ఇటీవల రిలీజ్ అయిన కల్కిలో అందరూ స్టార్లే ఉన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరో హీరోయిన్లు నటించారు. దీంతో వీల్లందరిని ఒకే స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు.


ఇక ఇప్పుడు అలాంటి మల్టీస్టారర్‌తో మరొక కొత్త సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ అండ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై సినీ ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘విక్రమ్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కమల్ హాసన్‌ను కంబ్యాక్ చేసిన లోకేష్.. ఆ తర్వాత విజయ్‌తో ‘లియో’ మూవీ తీసి మరో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు రజనీ కాంత్‌తో సినిమా తీస్తుండటంతో అందరిలోనూ భారీ హైప్ క్రియేట్ అయింది.

Also Read: ‘కూలీ’ షూటింగ్ అప్డేట్.. రజనీకాంత్‌తో సహా ఆ ఇద్దరితో కీలక సన్నివేశాల చిత్రీకరణ


అందులోనూ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. అందులో రజనీ మాస్ లుక్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ఆ గ్లింప్స్‌లో మొత్తం బంగారం చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. అంతేకాకుండా అందులో రజనీ డైలాగ్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ప్రతీ విషయంలోనూ రజనీకాంత్ ‘కూలి’ సినిమా నుంచి విడుదలవుతున్న అప్డేట్‌లకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మూవీని దర్శకుడు లోకేష్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోలుగా కాకుండా ఒకరు హీరోగా మరొకరు విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌ను ఢీ కొనే పాత్రలో టాలీవుడ్ మన్మథుడు, స్టార్ హీరో నాగార్జున నటిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా పరుగులు పెడుతోంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో.

Related News

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Big Stories

×