Rangareddy Crime News: ఏం జరిగిందో తెలీదు. కానీ దంపతులను కొట్టి దారుణంగా హత్య చేశారు. నిందితులు ఎవరు? దుండుగుల పనా? లేక దగ్గర బంధువుల ప్రమేయముందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఏరియాలో జంట హత్యలు కలకలం రేపాయి. రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలోని జనచైతన్య ఫేస్ 2లో ఈ ఘటన జరిగింది. అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ 5వ అంతస్తులో ఉంటున్నారు షేక్ అబ్దుల్లా-రిజ్వానా దంపతులు. ఒకరికి 70 ఏళ్లు కాగా, మరొకరికి 65 ఏళ్లుపై మాటే.
ఏం జరిగిందో తెలీదుగానీ, అక్కడి హత్యల సన్నివేశం చూస్తుంటే.. దంపతులను కొట్టి ఇంట్లో పేపర్ల కోసం వెతికినట్టు కనిపిస్తోంది. వృద్ధ దంపతులు రక్తం మడుగులో ఉండటాన్ని గమనించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హత్య జరిగిన సన్నివేశాన్ని గమనించిన పోలీసులు, దగ్గరవాళ్లు హత్య చేసి ఉంచవచ్చని అంచనా వేస్తున్నారు. అపార్ట్‌మెంట్, ఆ కాలనీలో ఏమైనా సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తున్నారు. డబ్బుల కోసం ఎవరైనా హత్య చేశారా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమితం ఆ దంపతుల మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: నడిరోడ్డులో పట్టపగలు రెండు చేతుల్లో తుపాకులతో కాల్పులు
హత్య జరిగిన ప్రాంతాంలో ఈ దంపతులకు సంబంధించి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని పరిశీలించారు. చివరకు దంపతులకు సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఓపెన్ అయితే గుట్టు బయటపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు అపార్టుమెంటులో సీసీటీవీ కెమెరాల గురించి ఆరా తీశారు. జంట హత్య కేసులో అసలు నిందితులెవరో చూడాలి?