Employee Kills Owner Wife| చాలా సంవత్సరాలు ఒకే యజమాని వద్ద పనిచేస్తున్న ఒక యువకుడు తనకు డబ్బు అవసరముందని చెప్పగానే ఆ యజమాని భార్య అతడికి ఆర్థిక సాయం చేసింది. అయితే ఆ అప్పు తీర్చమని ఆగ్రహించగానే అతడు ఆమెను, అమె కొడుకును దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్‌లోని ఒక బట్టల షాపులో 24 ఏళ్ల ముకేష్ పాస్వాన్ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బట్టల షాపు యజమాని కుల్దీప్ సెవానీ (44). ఆయన కుటంబంలో భార్య రుచికా (42), కొడుకు క్రిష్(14) ఉన్నారు. లజపత్ నగర్‌లోని ఎఫ్ బ్లాక్‌లోని మొదటి అంతస్తు ఫ్లాట్ కుల్దీప్ తన కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. కుల్దీప్ షాపులో ముకేష్ చాలా కాలంగా ఉద్యోం చేస్తున్నాడు. అతని షాపులో నలుగురు ఉద్యోగం చేస్తున్నా.. వారందరిలో కంటే ముకేష్ నే కుల్దీప్, అతని కుటుంబ సభ్యులు నమ్మేవారు. అందుకే యజమాని ఇంట్లో కుల్దీప్ తరుచూ వచ్చి వెళ్లేవాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ముకేష్ తనకు రూ.40,000 అవసరమని చెప్పగా.. అతడి యజమాని భార్య అయిన రుచికా వెంటనే అతని సాయం చేసింది. కానీ ఆ తరువాత ముకేష్ ఉద్యోగానికి రాలేదు. అతని ఫోన్ కూడా స్విచాఫ్ వచ్చేది. దీంతో కుల్దీప్ కు షాపులో కష్టంగా ఉండేది. ఈ విషయం తెలిసిన రుచికా.. ముకేష్ కు తాను రూ.40,000 అప్పుగా ఇచ్చానని భర్తకు చెప్పింది. దీంతో కుల్దీప్ తన భార్యపై కోపడ్డాడు. తనకు తెలియకుండానే ఎందుకు ఇచ్చావ్? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దీంతో రుచికా తరుచూ ముకేష్ కు ఫోన్ చేసేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముకేష్ ఫోన్ కు చేయగా.. అతను ఇక పనికి రాలేనని చెప్పాడు. దీంతో రుచికా అతడితో కోపంగా మాట్లాడింది. వెంటనే తన వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించాలని లేకపోతే ఉద్యోగానికి తిరిగి రావాలని బెదిరించింది. ఇది అవమానంగా భావించిన ముకేష్ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సాయంత్రం 7 గంటలకు ఇంట్లో కుల్దీప్ లేని సమయంలో ముకేష్ అక్కడికి వెళ్లాడు. అక్కడ రుచికా ఒంటరిగా ఉంటుందని వెళ్లగా.. ఆమెతో పాటు ఆమె కొడుకు క్రిష్ కూడా ఉన్నాడు. దీంతో ముకేష్ వారిద్దరినీ కత్తితో గొంతు కోసి హత్య చేసి వెళ్లిపోయాడు. రాత్రి 9 గంటల తరువాత కుల్దీప్ ఇంటికి వెళ్లగా.. ఇంట్లో రక్తం మరకలు కనిపించాయి. వాటి అనుసరిస్తూ వెళ్లి చూడగా.. బాత్ రూమ్ లో తన భార్య, కొడుకు శవాలు రక్తపు మడుపులో పడి ఉన్నాయి. ఇది చూసి కుల్దీప్ సహించలేకపోయాడు. ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
Also Read: వృద్ధాప్యంలో కటిక పేదరికం.. ఎద్దులకు బదులు స్వయంగా పొలం దున్నుతున్న 75 ఏళ్ల రైతు..
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించగా.. కుల్దీప్ తనకు ముకేష్ పైనే అనుమానం ఉందని చెప్పాడు. పోలీసులు రెండు రోజుల తరువాత ముకేష్‌ను ఉత్తరప్రదేశ్‌లోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రశ్నించగా.. ముకేష్ తనను రుచికా అవమానించి నందుకే హత్యలు చేశానని అంగీకరించాడు.