ZPHS school: చదువు చెప్పాల్సిన టీచర్.. విద్యార్థులను తమ పిల్లలుగా చూసుకోవాల్సిందిపోయి తానే ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశాడు ఇంగ్లీష్ టీచర్. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్… అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిలను టార్చర్ చేస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థినిలను వేధిస్తున్న ఇంగ్లీష్ టీచర్
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలిక స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ ఉండటంతో తమ తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నావ్.. స్కూల్‌కు వెళ్లకుండా అని నిలదీయడంతో విషయం బయటపడింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు మామిడి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి.. ఆరా తీయగా వారిపై గట్టిగా అరుస్తూ ఎదురు కేసు పెడతానంటూ బెదిరించాడు.
మాస్టర్ ఇంటికి వెళ్లి నిలదీసిన బాలిక తల్లిదండ్రులు
దీంతో శ్రీనివాస్‌ను చితకబాదారు బాలిక తల్లిదండ్రులు. ఒకరు చేసిందే తప్పు అంటే ఇతనికి తోడు మరికొందరు కలిసారు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టకుండా సెటిల్ చేసేందుకు.. కొంతమంది ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రయత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.
ఓ ప్రైవేట్ కాలేజీ కూడా నడుపుతున్న శ్రీనివాస్
మామిడి శ్రీనివాస్ నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్‌లో టీచర్‌గా పనిచేస్తూనే, ఒక ప్రైవేట్ కాలేజీ కూడా నడుపుతున్నాడు. ఆ కాలేజీలో చదివే అమ్మాయిలను కూడా ఇలాగే వేధింపులకు గురిచేస్తున్నట్లు గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.
ఆ టీచర్ ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రుల ఆందోళన
ఈ విషయం బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఆ టీచర్‌ను సస్పెండ్ చేసి ఫోక్సో కేసును నమోదు చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read: తెలంగాణలో అవినీతి మేత! ఫస్ట్ ప్లేస్‌లో ఏ శాఖంటే?
అధికారుల నిర్లక్ష్యం
ఈ విషయంపై నకిరేకల్ ఎంఈఓను ప్రశ్నించగా రెండో శనివారం సెలవు అంటూ.. సోమవారం చూసుకుంటానంటూ నిర్లక్ష్యంగా ఫోన్‌లో చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందు ఉండి చూసుకోవాల్సిన అధికారులే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరు అంటే ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.