CM Stalin cycles raid: పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ఫారెన్ వెళ్లారు తమిళనాడు సీఎం స్టాలిన్. అమెరికాలోని చికాగోలో ఆయన పర్యటించారు. షికాగో తీరాన్ని గమనించిన ఆయనకు.. ఎందుకోగానీ సైకిల్ రైడ్ చేయాలని అనిపించింది. వెంటనే కాసేపు సైకిల్ తొక్కారు.
దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ కొత్త కలలకు సంధ్యా సమయం వేదికగా నిలుస్తుందని రాసుకొచ్చారు సీఎం స్టాలిన్. ఆ వీడియోపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రియాక్ట్ అయ్యారు. బ్రదర్.. మనమిద్దరం చెన్నైలో ఎప్పుడు సైక్లింగ్ చేద్దామని సరదాగా చిన్న ప్రశ్న వేశారు. ఇప్పుడు రాహుల్ ట్వీట్ సీఎం స్టాలిన్ తొక్కిన వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెట్ యూజర్స్.
ALSO READ: టీచర్స్ డే సందర్భంగా మీ ప్రియమైన ఉపాధ్యాయులకు ఇలా విషెస్ చెప్పండి
తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఓ టీమ్ అమెరికా వెళ్లింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ రెండు వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించారు. పలు కంపెనీల అధినేత లతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు తమిళనాడు స్వర్గధామమని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్, ఐటీ పాలసీల గురించి వివరించారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, రీసెర్చ్, డేటా సెంటర్లను ఆర్టిఫీషియల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించారు. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అద్లెర్ ప్లానిటోరియం ముందుకొచ్చింది.
Brother, when are we cycling together in Chennai? 🚴 https://t.co/fM20QaA06w
— Rahul Gandhi (@RahulGandhi) September 4, 2024