NATO Warning: నాటో ఇప్పుడు ఇండియాపై ఫోకస్ చేసింది. ఏకంగా డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. రష్యాతో దోస్తి కట్ చేసి.. మేం చెప్పినట్టు వినకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని చెబుతోంది. ఇంతకీ నాటో వార్నింగ్‌పై మోడీ సర్కార్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? నాటో చెప్పినట్టు మనం ఆడాల్సిన అవసరం ఉందా?
100 శాతం సుంకాలు విధిస్తామంటూ వార్నింగ్
కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ ఎప్పుడో చెప్పారు.. ప్రపంచంలోని ఇతర దేశాల సమస్యలు యూరప్‌కు సమస్యలుగా కనపడవు కానీ.. యూరప్ సమస్య మాత్రం ప్రపంచ సమస్యగా చూడాలని అనుకుంటారని. ఇప్పుడదే నిజమని మరోసారి రుజువు చేసేలా ఉంది ఇప్పుడు నాటో అనుసరిస్తున్న తీరు. ఇకపై రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై వందశాతం సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే. ముఖ్యంగా భారత్, చైనా, బ్రెజిల్ దేశాల పేర్లను ప్రస్తావించారు. మార్క్ రెట్టే అమెరికా సెనెటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు రావాలని.. లేదంటే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. అంతేకాదు.. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు మార్క్.
పుతిన్ శాంతి చర్చలకు రావాలంటూ అల్టిమేటమ్
నాటో వార్నింగ్‌పై ఇప్పుడు మూడు దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్, నాటో వ్యాఖ్యలపై ఇప్పటికే రష్యా తీవ్రంగా స్పందించింది కూడా. ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించారు.. వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొన్నాం.. ఇప్పుడు ఈ ఆంక్షలను కూడా సమర్థంగా ఎదుర్కొంటామని తెలిపింది రష్యా. సో.. రష్యా సైడ్ నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేలిపోయింది.
NATO వార్నింగ్‌తో భారత్ భయపడుతుందా?
మరి భారత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాటో వార్నింగ్‌తో భయపడుతుందా? వెంటనే రష్యాతో వ్యాపారాన్ని తగ్గించుకుంటుందా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అసలు ముందు నాటో దేశాల సంగతి చూద్దాం. నిజానికి భారత్, చైనాలు రష్యా నుంచి ఇంధన దిగుమతులపై ఎక్కువగానే ఆధారపడ్డాయి. ఇది కాదనలేని నిజం. మరి యూరోపియన్ దేశాల సంగతేంటి? నాటో దేశాల సంగతేంటి? టర్కీ, సౌత్ కొరియా, తైవాన్, జపాన్, ఇతర యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తూనే ఉన్నాయి.
పైప్‌లైన్ గ్యాస్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్న ఈయా
గత నెలలో విడుదలైన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక ప్రకారం చూస్తే.. రష్యా నుంచి పైప్‌లైన్ గ్యాస్‌ను కొనుగోలు చేసేది ఈయూనే. రష్యా నుంచి వచ్చే 37 శాతం గ్యాస్‌ను ఈ దేశాలే దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక LNG విషయానికి వస్తే.. ఏకంగా 50 శాతం కొంటున్నాయి ఈయూ దేశాలు. ఇక ఆయిల్ ప్రొడక్ట్‌ల విషయానికి వస్తే.. టర్కీనే 26 శాతం దిగుమతి చేసుకుంటున్నాయి. టర్కీ.. నాటో దేశమే అనే విషయం మర్చిపోకూడదు.
మనల్నే టార్గెట్ చేయడం వెనక ఆంతర్యమేంటి?
మరి నాటోలో భాగమైన ఈయూ దేశాలు, టర్కీని వదిలేసి కేవలం భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను టార్గెట్ చేయడం వెనక ఆంతర్యమేంటి? నాటో ఇది కావాలనే చేస్తుందా? అసలు నాటో వెనకుండి కథ నడిపించేది అమెరికానా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు నాటో మాట విని రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపేస్తే.. ఇదే నాటో అదే ధరకు మరోచోట నుంచి చమురును మనకు అందిస్తుందా? ఎలాంటి ఆటంకాలు లేకుండా చమురును సరఫరా చేయగలుగుతుందా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు.
Also Read: యుగాంతం ఎఫెక్ట్.. అమెరికాలో భారీ భూకంపం
NATO, అమెరికా కలిసి ఆడుతున్న కుట్ర
ఇదంతా నాటో, అమెరికా కలిసి ఆడుతున్న కుట్రలా కనిపిస్తోందనేది ఇప్పుడు నిపుణుల మాట. రష్యాపై ఒత్తిడి తీసుకురావాలన్న పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలను తమ చెప్పుచెతుల్లో ఉంచుకునే ఎత్తుగడలా కనిపిస్తోంది. నిజంగా నాటోకు అంత చిత్తశుద్ది ఉంటే ముందుగా నాటో దేశాల వ్యాపారాలపై ఫోకస్ చేయాలి.. ఈయూ దేశాలను కట్టడి చేయాలి. ఆ తర్వాత ఇతర దేశాలకు సూక్తులు చెప్తే మంచిదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.