Guntur News: గుంటూరు జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలో వాగు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం అనపర్రులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే ఒక్కసారి గా పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు స్పాట్ లోనే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ALSO READ: Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి
జిల్లాలోని పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామంలో ఇద్దరు మహిళలు ఇవాళ కూలీ పనికి వెళ్లారు. పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం పడింది. ఇదే సమయంలో ఒక్కసారిగా భారీ ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికి అక్కడే చనిపోయారు. మృతులను సామ్రాజ్యం, నాగమ్మలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇద్దరు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తోటి కూలీలు పిడుగు పడి అకస్మాత్తుగా మృతి చెందడంతో మిగిలిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
ALSO READ: Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపార. భారీ వర్షాల నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడకూడదని వివరించారు. వీలైనంత త్వరగా పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.