BigTV English

Fire accident: హైదరాబాద్ గణపతి మండపంలో షార్ట్ సర్క్యూట్.. విలపిస్తున్న చిన్నారులు

Fire accident: హైదరాబాద్ గణపతి మండపంలో షార్ట్ సర్క్యూట్.. విలపిస్తున్న చిన్నారులు

Fire accident at Ganesh tent in Diskushnagar pnt colonuy: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ప్రతి ఏడాది లాగానే సంవత్సరం కూడా గణేష్ మండపాల వద్ద సందడి నెలకొంది. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ పరిధిలోని పీఎన్ టీ కాలనీ లో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటారు. చివరి రోజు అన్నదానం చేసి పదో రోజు భారీ సంఖ్యలో ఆ కాలనీ వాసులంతా పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సవాల మధ్య జారుకుంటారు. అంతా పదిహేనేళ్ల వయసులోపు ఉన్న పిల్లలే ఈ ఉత్సవాన్ని కాలనీలో వైభవంగా జరిపిస్తారు. కష్టపడి అందరినీ చందాలడిగి భారీ ఎత్తున వినాయకుడిని తెచ్చి అందంగా మండపాన్ని ముస్తాబు చేయడం ఆనవాయితీ.


ఇంటికెళ్లి వచ్చే లోపు..

ఈ సంవత్సరం కూడా అంతా సిద్ధం చేశారు. ఎంతో కష్టపడి పిల్లలు దేవుడి అలంకరణ పూర్తి చేసి ఇంటికి వెళ్లి స్నానం చేసి వచ్చాక పూజ మెదలు పెడదామని అనుకున్నారు. తీరా అప్పటిదాకా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసివుంది. ఒక్కసారిగా మెయిన్ స్విచ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కు గురైన మండపం చూస్తుండగానే మంటలు అంటుకున్నాయి. మొత్తం తమ కళ్ల ముందే బూడిదగా మరిపోయింది. అయితే అప్పటిదాకా అలంకరణ పూర్తి చేసి ఇంటికి వెళ్లి స్నానం చేసొద్దామని పిల్లలు భావించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేకపోతే అదే మండపంలో ఇరుక్కుని ఉండేవారని..అంతా గణపయ్య మహిమ అని పబ్లిక్ మాట్లాడుకోవడం కనిపించింది. అయితే తాము అలా వెళ్లి ఐదు నిమిషాల తర్వాత వచ్చి చూస్తే కాలి బూడిదైన మండపం కనిపించేసరికి చిన్నారులు పెద్ద ఎత్తున విలపించారు.


కష్టమంతా బూడిదపాలు

తమ కష్టం అంతా అలా కాలి బూడిదవడం చూసి వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు పిల్లలు. ఎందరో పెద్ద వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఆ చిన్నారులు. ఒక్క పైసా ఆశించకుండా కాలనీలోని పెద్దల వద్ద సేకరించిన చందాలను ప్రతి ఏటా లెక్క ప్రకారం ఖర్చుపెడుతుంటారు చిన్నారులు. అందుకే వారు అడగగానే చందాలు కూడా మారు మాట్లాడకుండా ఇచ్చేస్తుంటామని కాలనీ పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లలను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. తమ కష్టమంతా బూడిదపాలయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు చిన్నారులు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×