Road Accident: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మండిలో వ్యాన్ ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండడంతో.. అదుపు తప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. కార్మికులు పని కోసం పంజాబ్ లోని లుథియానా నుంచి మండిలోని ఐఐటీ కమంద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ALSO READ: Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! ప్రపంచంలో మరెక్కడా జరిగిన విధంగా..
పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. సహాయక చర్యలు చేపట్టారు. వెహికల్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Court Jobs: కోర్టులో 1620 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా?