Girl mutilated body inside in two trains: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికను హత్య చేసి ఆమె శరీర భాగాలను బ్యాగుల్లో మూటకట్టి రెండు వేర్వేరు రైళ్లలో పడేశారు. ముందుగా ఓ రైలులో ఉన్న గోనె సంచిలో బాలిక తల, మొండాన్నిఉండడాన్ని ప్రయాణికులు గుర్తించారు. మరో రైలులో కాళ్లు, చేతులున్న ఓ బ్యాగ్ ను కూడా పలువురు ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విధంగా రెండు రైళ్లలో బాలిక శరీర భాగాలు లభ్యం కావడంతో ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులను పట్టించినవారికి రూ. 10 వేల రివార్డ్ కూడా ఇస్తామని తెలిపారు.
మోవ్ నుంచి నాగ్దా మీదుగా ఇండోర్ కు తిరిగి వస్తున్న రైలులో ట్రాలీ బ్యాగ్, గోనె సంచులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో వాటిని చెక్ చేయగా అందులో ఓ బాలిక శరీర భాగాలు కనిపించాయి. తల, మొండెం మాత్రమే కనిపించాయి. మిగతా భాగాలు మాత్రం కనిపించలేదు. అదేరోజు రిషికేశ్ చేరుకున్న మరో రైలులో బియ్యం బస్తాలో రెండు చేతులు, రెండు కాళ్లు కనిపించాయి. పలువురు వీటిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read: రూ. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మిన ఘనుడు.. మోసపోయిన అమెరికా మహిళ!
ఈ ఘటన శనివారం జరిగినట్లు గుర్తించారు. రైళ్ల రాకపోకలను, ఆ రైళ్లలో ప్రయాణించిన వారిని పరిశీలించారు. ఆరోజు సాయంత్రం 5 గంటల తరువాత రెండు రైళ్లు ఉజ్జయిని ప్లాట్ ఫారమ్ నెంబర్2, 3పై ఉన్నాయని, ఆ సమయంలోనే ఈ బస్తాలను రైళ్లలో వేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. అయితే, అందులో ఎవరూ కూడా అనుమానాస్పదంగా కనిపించలేదని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. నిందితులెవరో తెలిపిన వారికి రూ. 10 వేల రివార్డు కూడా ఇస్తామంటూ ప్రకటించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.