Nail care: కొందరికి చేతి గోళ్లు చాలా పల్చగా, బలహీనంగా ఉంటాచి. దీని వల్ల తరచుగా విరిగిపోతుంటాయి. గోళ్లను అందంగా పెంచుకోవాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు గోళ్లు ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు గోళ్లను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అవి అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అందమైన గోళ్లను ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
గోళ్లను శుభ్రం చేయడం వల్ల వాటి కింద మురికి, బ్యాక్టీరియా తొలగిపోతుందట. గోళ్లను సున్నితంగా శుభ్రం చేయడానికి వెచ్చని, సబ్బు నీరు, మృదువైన బ్రష్‌ను ఉపయోగించడం మంచిది. తేమ గోరు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి కడిగిన తర్వాత గోళ్లను బాగా ఆరబెట్టాలి.
తరచుగా నూనె లేదా పెట్రోలియం జెల్లీ వాడడం వల్ల క్యూటికల్స్‌ను మృదువుగా మారతాయి. అంతేకాకుండా గోళ్లు హైడ్రేటెడ్‌గా ఉంటాయట. గోళ్లను చాలా పొడవుగా పెరగనివ్వవద్దు. ఎందుకంటే అవి మరింత సులభంగా విరిగిపోతాయి.
ALSO READ: ట్రెండీ లుక్ కోసం కాస్త మేకప్ వేద్దామా..?
గోరు కొరకడం వల్ల గోళ్లు దెబ్బతినడమే కాకుండా నోట్లోకి బ్యాక్టీరియా వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారు దీన్ని మానుకోవడం ఉత్తమం.
ఎక్కువ కాలం ఉండే గోళ్ల రంగు కోసం జెల్ పాలిష్‌ని ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి గోరు ఉపరితలం దెబ్బతినకుండా ఉండటానికి హెల్ప్ చేస్తాయట.
నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇందులో ఉండే ఎసిటోన్ వల్ల గోళ్లపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గోళ్లు పల్చగా మారిపోతాయట. మరికొన్ని సందర్భాల్లో గోళ్లను విరిగిపోయేలా కూడా చేస్తాయట. అందుకే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను తక్కువగా వాడడం మంచిది.
బలమైన నెయిల్స్ కోసం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం
బయోటిన్, విటమిన్-ఇ అధికంగా ఉండే అహారం తీసుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బయోటిన్ ఎక్కువగా ఉండే గుడ్లు, ధాన్యాలు, ఆకు కూరలను ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. అలాగే విటమిన్-ఇ అధికంగా ఉండే బాదం, బచ్చలికూర, అవకాడో తీసుకోవడం వల్ల గోర్లు బలంగా పెరుగుతాయి.