E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Gold Seized: బంగారం అక్రమ రవాణా.. 37 కేజీల గోల్డ్ సీజ్, తెర వెనుక ఇంటర్నేషనల్ ముఠా

Gold Seized: బంగారం అక్రమ రవాణా.. 37 కేజీల గోల్డ్ సీజ్, తెర వెనుక ఇంటర్నేషనల్ ముఠా
Advertisement

Gold Seized: దేశంలో బంగారం అక్రమ రవాణా మొదలైందా? దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం మాఫియా అటు వైపు ఫోకస్ చేసిందా? అస్సాం పోలీసులు 37 కేజీల బంగారం సీజ్ వెనుక ఏం జరిగింది? అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ మాఫియా ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 బంగారం అక్రమ రవాణా.. 37 కేజీల గోల్డ్ సీజ్ చేసిన అస్సాం పోలీసులు

Advertisement

భారతీయులతో బంగారం మమేకమైంది. పశ్చిమాసియా క్రైసిస్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండేలా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడడం కోసం తీవ్రప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో బంగారం, వెండిపై దిగుమతిపై భారీగా సుంకాలు పెంచింది కేంద్రప్రభుత్వం.

6 శాతంగా ఉన్న పన్ను ఒక్కసారి 15 శాతానికి పెంచేసింది. దీనికితోడు 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ వంటివి ఉన్నాయి. దీంతో దేశంలో బంగారం కొనుగోళ్లు మందగించాయని నివేదికలు తేల్చాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో అస్సాం పోలీసులు 37 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.

Advertisement

బంగారం రవాణా వెనుక అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా

బంగారంతోపాటు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు పేరు అక్షయ్ బన్సోడే, వయస్సు 32 ఏళ్లు. నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతానికి చెందిన అక్షయ్.. రెండు నెలలుగా గౌహతిలోని గాంధీ బస్తీ ప్రాంతంలో మకాం వేశాడు. ఈ క్రమంలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంభవి మిశ్రా వెల్లడించారు. నిందితుడ్ని పట్టుకుని బంగారు కబడ్డీలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ సరుకుకు సంబంధించి ఎలాంటి పత్రాలను చూపించలేదని తెలిపారు. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ మాఫియాతో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులతో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.

ALSO READ: ORRపై అర్ధరాత్రి కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై పోలీసుల కాల్పులు!

గ్యాంగ్ సిండికేట్‌, గతంలో చేసిన డెలివరీలు, ఇతర సంబంధాలపై ఫోకస్ చేసినట్టు వెల్లడించారు. నిందితుడు అక్షయ్ నెలకు రూ. 80 వేలు కాగా, బంగారం డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. గతంలో మూడుసార్లు దాదాపు 20 కిలోల బంగారం అక్రమ రవాణాలో పాలుపంచుకున్నట్లు తేలింది. నాలుగో ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు.

అస్సాం, ఈశాన్యంలోని ఇతర ప్రాంతాల్లో బంగారం అక్రమ రవాణా జరుగుతోంది. అధిక భాగం మయన్మార్ నుండి దేశంలోని వస్తోంది. మణిపూర్‌లోని మోరే, మిజోరంలోని జోఖావ్‌థార్ ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు వస్తోంది. అక్కడి నుంచి పశ్చిమాసియాకు వెళ్తున్నట్లు సమాచారం.

Related News

ORRపై అర్ధరాత్రి కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై పోలీసుల కాల్పులు!

పల్నాడులో ఘోరం.. ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ.. నలుగురు సజీవ దహనం!

Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం

Murder Case: ప్రియుడితో కలిసి భార్య దారుణం.. నిద్రిస్తున్న భర్తపై రుబ్బురోలు రాయితో దాడి..!

గన్నవరం బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఓ ఇల్లు.. స్పాట్‌లో!

Big Stories

×