E-Paper
Advertisement

ఊరు ఊరంతా దొంగలే… పొరపాటున ఫోన్ ఎత్తితే లక్షల్లో డబ్బు మాయం

ఊరు ఊరంతా దొంగలే… పొరపాటున ఫోన్ ఎత్తితే లక్షల్లో డబ్బు మాయం
Advertisement

Crime Web Series: ఇటీవల కాలంలో డిజిటల్ స్కామ్ లు భారీగా పెరిగిపోయాయి. వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాత్రమే కాదు… ఒక చిన్న మెసేజ్ లో వచ్చే లింకును క్లిక్ చేసినా సరే లక్షల్లో డబ్బు మటుమాయం అవుతుంది. కానీ ఈ విషయాలు తెలియక చాలామందికి అమాయకులు బలి అవుతుంటారు. మరి ఒక ఊరు ఊరంతా ఇలాంటి స్కామర్లే ఉంటే ఎలా ఉంటుంది ? ఆ విషయం తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. 2020లో విడుదలై సంచలనం సృష్టించిన ప్రముఖ హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘జామ్‌తారా – సబ్‌కా నంబర్ ఆయేగా’ (Jamtara – Sabka Number Ayega)నే ఆ సిరీస్.

కథలోకి వెళ్తే…

జార్ఖండ్ రాష్ట్రంలోని ‘జామ్‌తారా’ అనే ఒక చిన్న గ్రామం చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో ఉండే సన్నీ (స్పర్శ్ శ్రీవాస్తవ్), రాకీ (అన్షుమాన్ పుష్కర్) అనే ఇద్దరు బంధువుల నేతృత్వంలో కొందరు చదువురాని, సగం చదువుకున్న కుర్రాళ్ళు ఒక గ్యాంగ్‌ గా మారి స్కామ్ లు చేస్తారు. ఈ కుర్రాళ్ళు మొబైల్ ఫోన్లు పట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న అమాయక ప్రజలకు బ్యాంక్ అధికారుల్లా ఫోన్లు చేస్తుంటారు. మాటల మార్పిడితో వారి బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ (OTP)లను దొంగిలించి క్షణాల్లో వారి ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేస్తుంటారు. దీనినే ‘ఫిషింగ్ స్కామ్’ అంటారు.

Advertisement

ఈ మోసాల ద్వారా వారు రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఈ చిన్న కుర్రాళ్ళు ఇంత భారీగా డబ్బు సంపాదిస్తున్నారనే విషయం స్థానిక అవినీతి రాజకీయ నాయకుడు బ్రజేష్ భాన్ (అమిత్ సియాల్)కు తెలుస్తుంది. అతను ఈ కుర్రాళ్ళను బెదిరించి, వారి బిజినెస్‌లో తనకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అంతేకాదు తన ఆధ్వర్యంలోనే ఈ స్కామ్ నడపాలని ఒత్తిడి తెస్తాడు.

దీంతో సన్నీ, రాకీల మధ్య విభేదాలు షురూ అవుతాయి. ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి డాలీ సాహు (అక్షా పార్దసాని) అనే ఒక దక్షత గల కొత్త మహిళా ఎస్పీ (SP) జామ్‌తారాకు బదిలీపై వస్తుంది. ఆమె ఈ ముఠాను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక ఆపరేషన్ మొదలు పెడుతుంది. కానీ స్థానిక పోలీస్ వ్యవస్థలో ఉన్న అవినీతి, రాజకీయ అండదండల వల్ల ఆమెకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. పోలీసుల వ్యూహాలు, బ్రజేష్ భాన్ క్రూరత్వం, సన్నీ-రాకీల మధ్య పెరిగిన శత్రుత్వం మధ్య ఈ సైబర్ క్రైమ్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది ? చివరకు పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారా లేదా ? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సిరీస్ సాగుతుంది.

Advertisement

ఈ సిరీస్ మొత్తం 2 సీజన్లు ఉండగా… సీజన్ 1 – 10 ఎపిసోడ్లు, సీజన్ 2 – 8 ఎపిసోడ్లు ఉంటుంది. అమిత్ సియాల్, స్పర్శ్ శ్రీవాస్తవ్, అన్షుమాన్ పుష్కర్, అక్షా పార్దసాని ఇందులో మెయిన్ రోల్స్ పోషించారు. ఈ సిరీస్ కేవలం హిందీ ఒరిజినల్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ తో Netflix ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియోతో ఓటీటీలో అందుబాటులో లేదు. భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన రియల్ ‘ఫిషింగ్’ స్కామ్‌ల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‌కు సంబంధించిన 2 సీజన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also: హైటెక్ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో అరాచకం… మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్…

Tags

Related News

దర్జీ చెప్పిన ఒక్క అబద్ధం… రెండు దేశాలను యుద్ధానికి దించిందంటే నమ్ముతారా భయ్యా ?

గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ

ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

అడవిలో వీకెండ్‌కి వెళ్లిన అమ్మాయి… తెల్లారేసరికి వ్యాన్‌లో బందీ… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం మొత్తం రోడ్డున… అమ్మాయి రంగంలోకి దిగాక రచ్చ రచ్చ

ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పైనే పిచ్చి… పెళ్ళాం ఉన్నా వదలకుండా ఇదేం అరాచకం భయ్యా

Big Stories

Advertisement
×