BigTV English

Urine in Food: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. ఆ విషయం ఎలా బయటపడిందంటే?

Urine in Food: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. ఆ విషయం ఎలా బయటపడిందంటే?

Housemaid Urine Cooking| దేశ రాజదాని ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్ జిల్లా (ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం)లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వార్త విని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఒక బడా వ్యాపారి ఇంట్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వంటమనిషి ఒక అసహ్యకరమైన పనిచేసింది. ఆమె చేసిన వంట తిని ఆ వ్యాపారి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అనారోగ్యం పాలయ్యారు. ఇంట్లో అందరికీ లివర్ ఇన్‌ఫెక్షన్ సమస్య వచ్చింది. చాలా రోజులుగా చికిత్స తీసుకుంటున్నా వారికి ఇన్‌ఫెక్షన్ తగ్గలేదు. దీంతో ఆ బడా వ్యాపారి ఎందుకిలా జరుగుతోందని ఆరా తీయగా.. అతని ఇంట్లో పనిమనిషి వంటలో మూత్రం కలిపేదని తెలిసింది.


వివరాల్లోకి వెళితే.. గాజియాబాద్ జిల్లాలోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతానికి చెందని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని కుటుంబం అంతా గత నెల రోజులుగా లివర్ ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు. లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ల వద్ద కుటుంబమంతా చికిత్స్ పొందుతున్నారు. కానీ ఇన్ని రోజులుగా డాక్టర్ సూచించిన మందులు తింటున్నా వారందరి ఆరోగ్యం మెరుగుపడలేదు. పైగా ఇంకా క్షీణిస్తోంది. దీంతో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి డాక్టర్లు వారంతా తినే ఆహారంలో ఏదో కల్తీ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..


డాక్టర్లు చెప్పింది విని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి బయటి ఆహారం తినడం మానేశాడు. కుటుంబసభ్యులందరూ ఇంట్లో చేసిన వంట మాత్రమే తినాలని చెప్పాడు. డాక్టర్లు సూచించిన ఆహారం మాత్రమే అది కూడా ఇంట్లో వండిన ఆహారమే అందరూ తింటున్నా గత వారం రోజులుగా వారి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. ఆ వ్యాపారి కొడుకు ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో ఆ వ్యాపారికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చివరికి అతనికి తన వంట మనిషిపై అనుమానం వచ్చింది. తాము కేవలం ఇంట్లో చేసిన వంట మాత్రమే తింటుండడంతో అతను వంటింట్లో రహస్యంగా ఒక కెమెరా పెట్టాడు. అక్కడ పనిమనిషి భోజనం ఎలా చేస్తోందో చూడాలని అలా చేశాడు.

అయితే ఆ రహస్య కెమెరాలోని దృశ్యాలు చూసి అతనికి చెమలు పట్టాయి. అతని ఇంట్లోని వంటమనిషి తన మూత్రం కలిపి వంట చేస్తున్నట్లు అర్థమైంది. వీడియోలో ఆమె తన మూత్రం ఒక వంట పాత్రలో పోసి అందులో కొంత నీరు కూడా కలిపి చపాతి పిండి కలపడానికి ఆ నీరు ఉపయోగించింది. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో తీసుకొని ఆ వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీడియో ఆధారంగా ఆ వంటమనిషిని అరెస్ట్ చేశారు.

Also Read: అత్తకు రోజూ అల్లుడు మెసేజ్‌లు.. అరెస్ట్ చేసిన పోలీసులు, పాపం ఆమె గుండె పగిలింది

8 ఏళ్లుగా పనిచేస్తున్న వంటమనిషి
గాజియాబాద్ లోని శాంతినగర్ ప్రాంతంలో నివసించే రీనా అనే మహిళ గత 8 ఏళ్లుగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పనిచేస్తోంది. ఏడాది క్రితం ఆమె ఇంట్లో దొంగతనం చేసిందని… అయినా ఆమెను క్షమించి వదిలేశామని వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×