Virat Kohli Followers Vs Pakistan Population: టీమిండియా మాజీ కెప్టెన్, డేంజర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని నలుమూలల విరాట్ కోహ్లీకి ( Virat Kohli Followers) అభిమానులు ఉన్నారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విరాట్ కోహ్లీని ఆరాధించే వాళ్లు కోట్లల్లో ఉన్నారు. ఇక అతని సోషల్ మీడియా ఫాలోవర్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కోట్లలో విరాట్ కోహ్లీకి సోషల్ మీడియా ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియన్ క్రికెటర్లలో ఏ క్రికెటర్ సాధించలేని అభిమాన గణాన్ని సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ సాధించాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తలదించుకునేలా విరాట్ కోహ్లీ చేశాడు. విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ( Virat Kohli’s Instagram followers) కంటే పాకిస్తాన్ జనాభా చాలా తక్కువగా ఉంది. దీంతో పాకిస్తాన్ ను దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రీడాకారుడు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో 272 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 27.2 కోట్ల అభిమానులను విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. అదే పాకిస్తాన్ జనాభా 259.5 మిలియన్లు మాత్రమే. అంటే పాకిస్తాన్ లో ఇప్పటి వరకు ఐక్య రాజ్య సమితి ప్రకటించిన గణాంకాల ప్రకారం 25.95 కోట్ల జనాభా ఉన్నారు.
ఈ లెక్కన విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ కంటే రెండు కోట్ల జనాభా పాకిస్తాన్ లో తక్కువగానే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక దేశ జనాభా కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ సంపాదించాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి పాకిస్తాన్ దద్దమ్మలు విరాట్ కోహ్లీ గురించి తప్పుడుగా వాగుతారని.. కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఫాలోవర్ల సంఖ్యను చూసైనా విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తన్వీర్ అహ్మద్, షాహిద్ అఫ్రిది లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ క్రీడాకారులలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. మొదట క్రిస్టియానో రోనాల్డో ఉండగా, ఆ తర్వాత లియోనెల్ మెస్సి స్థానం దక్కించుకున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అదే ఆసియా ఖండం నుంచి మాత్రం విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఎక్కువ ఫాలోవర్స్ తో స్థానం సంపాదించుకున్నాడు.
విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క స్పాన్సర్డ్ పోస్ట్ కోసం 11 కోట్ల నుంచి 14 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఒక నెలలో స్పాన్సర్షిప్ ల ఆధారంగా విరాట్ కోహ్లీ ఆదాయం కూడా ఉంటుంది. అటు విరాట్ కోహ్లీ ఆస్తులు రూ.1000 కోట్లకు పైగా ఉన్నాయి. బిసిసిఐ నుంచి వచ్చే జీతాలు, ఇతర ప్రైవేట్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విరాట్ కోహ్లీ బాగానే సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా ఏడాదికి 21 కోట్ల వరకు అర్జిస్తున్నాడు. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసినందుకు కూడా కోట్లల్లో సంపాదిస్తున్నాడు.