Karimnagar Road Accident: మరికొన్ని గంటల్లో పెళ్లి..! ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మండపం కూడా సిద్ధమైంది. బంధువులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పెళ్లి కొడుకు కూడా కారులో బయల్దేరాడు. ఇంతలోనే ఊహించని ఘటన. కారు వెళ్లి DCMను ఢీకొట్టింది. దీంతో పెళ్లి కొడుక్కి తీవ్రగాయాలవ్వడంతో.. మ్యారేజీ ఆగిపోయింది. జగిత్యాల జిల్లాలో జరిగిందీ ఘటన.
మహారాష్ట్ర.. నాందేడ్‌కు చెందిన మహేశ్‌కు హుజురాబాద్‌లో ఓ వధువుతో పెళ్లి నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. దాంతో రాత్రి నాందేడ్ బంధవులతో కలిసి కారులో బయల్దేరాడు పెళ్లి కొడుకు. కొండగట్టు దగ్గర టీ తాగి మళ్లీ స్టార్ట్ అయ్యారు. ఐతే నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న DCMను ఢీకొట్టాడు కారు డ్రైవర్. దాంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఓ చిన్నారి స్పాట్‌లోనే చనిపోయింది. పెళ్లి కొడుకు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.
కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కూలీలు వెంకట్రావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బాధితులకు ఆత్మకూరు ఏరియా హాస్పిటల్‌కు చికిత్స కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై. గురువారం తెల్లవారుజామున ఆత్మకూరు మండల పరిధిలోని క్రాస్ రోడ్డు దగ్గర కారు అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: కుప్పంలో హర్యానా దొంగల గ్యాంగ్ బీభత్సం.. కారుతో పోలీసులపైకి, ఆపై కాల్పులు
క్షతగాత్రులను హుటాహుటినా సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో కూలీలు వెంకటరావుపల్లి నుంచి ముస్తాపురం ఆటోలో వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.