BigTV English

Kiss Allergy: ‘నన్ను ముద్దు పెట్టుకోవాలంటే షరతులు వర్తిస్తాయి’.. బాయ్‌ఫ్రెండ్స్‌కు యువతి కండీషన్స్ వైరల్

Kiss Allergy: ‘నన్ను ముద్దు పెట్టుకోవాలంటే షరతులు వర్తిస్తాయి’.. బాయ్‌ఫ్రెండ్స్‌కు యువతి కండీషన్స్ వైరల్

Kiss Allergy| ప్రేమికులు ముద్దు పెట్టుకోవడం అనేది కేవలం శృంగారం మాత్రమే కాదు అది ఒక మధురమైన అనుభూతి. కానీ ఈ అనుభూతి పొందే అదృష్టం ఒక యువతికి లేదు. ఆమెను ఎవరైనా ముద్దు పెట్టుకుంటే ఈ యువతి తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. విషయం సీరియస్ అయితే ప్రాణాలే పోతాయని డాక్టర్లు చెప్పారట. అందుకే ఆమె తనను ఎవరైనా ప్రేమించాలన్నా.. పెళ్లి చేసుకోవాలన్నా వారికి కొన్ని కండీషన్స్ పెట్టింది. అవి పాటిస్తేనే వారితో డేటింగ్ చేస్తుందట. ఇదంతా వింటుంటే కేవలం ముద్దు పెట్టుకుంటే ఇంత సీరియస్ ఏంటి? అని అనుమానం రాక మానదు. కానీ ఇది నిజమే. ఆ యువతికి అరుదైన వ్యాధి ఉంది. దీనంతటికీ కారణం అదే.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం బోస్టన్ నగరానికి చెందిన కెరోలిన్ క్రే క్విన్ అనే యువతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టిక్ టాక్ లో యాక్టివ్ గా ఉంటుది. తరుచూ తన గురించి ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే 2017 సంవత్సరంలో ఒకరోజు కెరోలిన్ కు అనుకోకుండా ఒక సమస్య వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఆమె లిప్ కిస్ చేసింది. కానీ కొంత సమయం తరువాత ఆమెకు ఒళ్లంతా దురద వచ్చింది. ఆ తరువాత ఛాతి, చేతులు, వీపు మీదంతా రాషెస్ వచ్చాయి. దాంతో ఆమె డాక్టర్ వద్దకు వెళ్లింది. డాక్టర్ ఆమెకు అలర్జీ ఉందని చెప్పి.. కొన్ని మందులు రాసిచ్చి పంపించేశాడు.

వారం రోజుల తరువాత కెరోలిన్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో మరోసారి లిప్ కిస్ చేసింది. దీంతో ఆమెకు మరోసారి ముందులాంటి అలర్జీ చేసింది. ఈ సారి డాక్టర్ ఆమెకు సీరియస్ అలర్జీ ఉందని చెప్పి.. అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు పంపించాడు. అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్.. కెరోలిన్ కు పరీక్షలు చేసి ఆమెకు మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS) అనే అలర్జీ ఉందని చెప్పాడు. ఈ అలర్జీ ఉన్నవాళ్లు పీనట్స్ (వేరుశెనగ పల్లీలు), ట్రీ నట్స్, సీసెమ్ (నువ్వులు), కివి ఫ్రూట్, మస్టర్డ్, సీ ఫుడ్ లాంటివి తినకూడదని చెప్పాడు. కెరోలిన్ డాక్టర్ సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించింది. అయితే కెరోలిన్ జాగ్రత్తలు పాటించినా ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం ఇవన్నీ తిన్నాడు.. దీంతో అతడిని మరోసారి ముద్దుకోగానే సీన్ మరోసారి రీపీట్ అయింది. ఈ సారి డాక్టర్ ఆమె ఇంట్లో ఎవరైనా సూచించిన తినకూడన ఆహారం తింటున్నారా? వారిని ముద్దు పెట్టుకున్నావా? అని అడిగాడు.


Woman kiss allergy

అప్పుడు కెరోలిన్ కు ఏం జరుగుతోందో? అర్థమైంది. కెరోలిన్ బాయ్ ఫ్రెండ్ ని వెంటనే పిలిచి.. తనని కూడా డాక్టర్ సూచించిన ఆహారం తినకూడదని చెప్పింది. అయితే అతను ఆమె చెప్పిన దానికి అంగీకరించలేదు. దీంతో అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తరువాత తనను ఎవరైనా డేటింగ్ చేయాలనుకునే యువకుడు తాను చెప్పిన్న మూడు రూల్స్ పాటించాలని కండీషన్ పెట్టింది. రూల్ నెంబర్ 1. తనను ముద్దుపెట్టుకోవాలంటే డాక్టర్ సూచించిన ఆహార పదార్థాలు కనీసం 24 గంటలపాటు తినకుండా ఉండాలి. రూల్ నెంబర్ 2. ముద్దు పెట్టుకునేందుకు ముందు కనీసం మూడు గంటలపాటు ఏమీ తినకుండా ఉండాలి. రూల్ నెంబర్ 3. ముద్దు పెట్టుకునే ముందు ప్రత్యక్షంగా ఆ యువకుడు తన ఎదుటే బ్రష్ చేసుకోవాలి.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

ఈ జాగ్రత్తలు పాటించకుండా ఆమెను ఎవరైనా ముద్దుకుంటే అలర్జీ వల్ల కెరోలిన్ కు విరేచనాలు, వాంతులు, ఊపిరాడకపోవడం, అరుదైన సందర్భాలలో శరీరమంతా రాషెస్ వచ్చి మరణం కూడా సంభవించవచ్చు. అంతేకాదు కెరోలిన్ కు దుమ్ము, జంతువుల వెంట్రుకలు, కొన్ని మసాలా వాసనలు లాంటి వల్ల కూడా అలర్జీ ఉంది.

కెరోలిన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. 2017లో తనకు ఉన్న అరుదైన వ్యాధి గురించి తెలిశాక.. ఇప్పటివరకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ చేసుకున్నట్లు తెలిపింది. తనకు బాయ్ ఫ్రెండ్ కంటే ఆరోగ్యం, ప్రాణాలు ముఖ్యమని చెప్పింది. కానీ ఇటీవలే తన జీవితంలో రయాన్ అనే కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడని.. తాను పెట్టిన అన్ని కండీషన్స్ ని అతను ఒప్పుకున్నాడని చెప్పింది.

Related News

Himachal Pradesh News: భర్తకి దొరికిన భార్య.. హోటల్ గదిలో ప్రియుడితో, వైరల్ వీడియో

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Big Stories

×