Kurnool Shocking Murder: ఒకప్పుడు.. ఎవరి మీదైనా చేయి వేయాలంటేనే.. ఒకటికి పది సార్లు ఆలోచించేవాళ్లు. కోపం కట్టలు తెంచుకుంటే తప్ప.. ఎదుటివారిపై దాడి చేసే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయ్. మర్డర్లు కూడా చాలా సింపుల్‌గా చేసేస్తున్నారు. కర్నూలులో అయితే.. ఒకతన్ని చంపి.. అతని కాలు నరికి.. దాన్ని ఊరేగించి.. పోలీస్ స్టేషన్ సమీపంలో పడేసి.. అరాచకం సృష్టించారు.
ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన మర్డర్ కేసులన్నింటిలోనూ.. కామన్ పాయింట్ ఒకటే ఉంటోంది. అదే.. చాలా మంది ప్రాణాలు తీస్తోంది. అంతటా సంచలనం సృష్టిస్తోంది. ప్రతి మర్డర్ కేసు.. అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరికి.. అక్కడికే వెళ్లి ఆగుతోంది. అక్కడే.. ఎండ్ అవుతోంది. అదే.. వివాహేతర సంబంధాలు. ఇప్పుడు.. కర్నూలులో జరిగిన దారుణ హత్యకు కూడా అదే కారణమంటున్నారు. వివాహేతర సంబంధం కారణంగా.. శేషన్న అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు కొందరు దుండగులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శేషన్న తన ఇంట్లో ఉండగా.. అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు.. అతని ఇంట్లోకి చొరబడ్డారు. కొడవళ్లు, కర్రలతో దాడి చేసి.. దారుణంగా హతమార్చారు. శేషన్నని చంపేశాక.. అతని కాలుని నరికేశారు. ఆ నరికిన కాలితో ఊరేగారు. బైక్‌పై.. ఆ కాలుని తీసుకొని కొంత దూరం ప్రయాణించారు. తర్వాత.. ఆ కాలుని.. పోలీస్ స్టేషన్‌లో సమీపంలో వేసి పరారయ్యారు.
శేషన్న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. గ్రామంలోని సీసీటీవీలు, స్థానికుల వాంగ్మూలాలు ఆధారంగా అందిన సమాచారం ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ మంది ఈ ఘటనలో పాల్గొన్నట్టు స్పష్టమవుతోంది. శేషన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనితో పాటు, నరికిన కాలుతో ఊరేగించడానికి ఉపయోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
వివాహేతర సంబంధం కారణంగా.. కోపంతో రగిలిపోయి హత్య చేశారు. అతని ప్రాణాలు తీశారు. అయినా.. వారి కోపం చల్లారలేదు. అతని కాలుని కూడా ఎందుకు నరికారు? ఆ నరికిన కాలుని.. బైక్ మీద ఊరేగించాల్సినంత కక్ష ఎందుకు? చంపడమే పెద్ద తప్పు. అందులోనూ.. ఇంత అరాచకంగా వ్యవహరించాల్సినంత అవసరం, అంత కోపం ఎందుకు? అనేదే.. ఎవ్వరికీ అంతుబట్టడం లేదు.
Also Read: లవర్‌ని చంపి డెడ్‌బాడీతో 2 రోజులు.. ఏం జరిగిందంటే
ఇలాంటి ఘటనలు చూస్తే, మన సమాజంలో ఆత్మ నియంత్రణ, శాంతి, సంయమనం అనే విలువలు నశించిపోతున్నాయనిపిస్తుంది. వివాదాల పరిష్కారం కోపంతో, క్రూరతతో కాదు. చట్టం మీద నమ్మకం ఉంచి, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలి. ఒకరినొకరు చంపుకోవడం ద్వారా సమస్యలు సులభంగా తీరవు.