Salt Water: ఉప్పు ప్రతి ఒక్కరు నిత్యం వంటకాల తయారీలో మాత్రమే కాకుండా పాటు వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఉప్పు లేకుండా ఆహారం తినడం కష్టం. ఇది ఆహార రుచిని పెంచే సాధనం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. డాక్టర్లు కూడా శరీరానికి తగిన మోతాదులో ఉప్పు తీసుకోవాలని చెబుతుంటారు.
సలాడ్లలో చల్లుకోవడం లేదా డ్రింక్స్ లో కూడా ఉప్పును యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉదయాన్నే ఉప్పునీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. కొంతమంది నిపుణులు ఖాళీ కడుపుతో ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది:
ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటాము. ఇది పొటాషియం, కాల్షియం , మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.శరీరం యొక్క ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి ఉప్పు కలిపిన నీరు సహాయపడుతుంది. బిజీ లైఫ్ కారణంగా.. చాలా మంది ఎక్కువగా నీరు తాగరు. ఇది డీ హైడ్రేషన్ కు కారణమవుతుంది. ఇలాంటి సమయంలో ఉప్పు కలిపిన నీరు తాగడం మంచిది. ఇది శరీర హైడ్రేషన్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
ఎముకలకు బలం:
ఉప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం అని చెప్పవచ్చు.
చర్మానికి మెరుపు తెస్తుంది:
ఉదయం పూట ఉప్పునీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఇది అనేక వ్యాధుల ప్రమాధాన్ని కూడా నివారిస్తుంది. ఇది మూత్రపిండాలు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఉప్పు కలిపిన నీరు టాక్సిన్స్ తొలగించడం వల్ల చర్మానికి సహజ మెరుపు వస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మొటిమలు, సోరియాసిస్, తామర వంటి సమస్యల లక్షణాలను కూడా తగ్గించవచ్చు.
జీర్ణశక్తి బలపడుతుంది:
ఉప్పు కలిపిన నీరు జీర్ణ శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతే కాకుండా ఇది శరీరం యొక్క pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ లేదా ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు ఉన్నవారు ఉదయం పూట గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. జీర్ణక్రియ సరిగ్గా పని చేసినప్పుడు.. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Also Read: పెళ్లి తర్వాత.. ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా ?
బరువు తగ్గడం:
ఉప్పు కలిపిన నీరు బరువు తగ్గించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే ఖనిజాలు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. తద్వారా కేలరీలు బర్న్ అయ్యే వేగం కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ఇది ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని తొలగించడం ద్వారా నీటి నిలుపుదల సమస్యను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీంతో పాటు. ఉప్పు కలిపిన నీరు ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది.