OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ జానర్ లో వస్తున్నసినిమాలను, భాషతో సంబంధం లేకుండా చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు. అయితే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్, సీరియల్ కిల్లర్ ల చుట్టూ తిరుగుతాయి. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగుతాయి. మీరు ఇది వరకే చూసినా, ఒకవేళ చూడకపోయినా వీటిపై ఓ లుక్ వేయండి.
‘పోర్ తోజిల్’ (por thozhil)
2023లో విడుదలైన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి విగ్నేష్ రాజా దర్శకత్వం వహంచారు. ఇందులో ఆశోక్ సెల్వన్, ఆర్. శరత్ కుమార్, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తిరుచిరాప్పళ్లిలో జరిగే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ కథ నడుస్తుంది. ఒక కొత్తగా వచ్చిన ట్రైనీ DSP ప్రకాశ్ పిరికి స్వభావం కలిగి ఉంటాడు. అతని కుటుంబం ఒత్తిడితో పోలీసు ఉద్యోగంలో చేరతాడు. అమ్మాయిలను వరుసగా హత్యలు చేస్తున్న ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి, SP లోగనాథన్ తో కలిసి పనిచేయడానికి ప్రకాశ్ ను పై అధికారులు నియమిస్తారు.ఈ కిల్లర్ ని ఎలా పట్టుకుంటారనేదే ఈ స్టోరీ. సోనీ లివ్ (Sonyliv) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
‘తొట్టక్కల్’ (Thottakkal)
2017లో విడుదలైన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఇందులో కచ్చా రవిచంద్రన్, అరుంధతి నాయర్, మరియు ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ సినిమా ‘అమ్మాయి నీవే’ పేరుతో డబ్ చేయబడింది. ఇది ఒక పోలీసు అధికారి జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. శివ ఒక నిజాయతీ కలిగిన కఠినమైన పోలీసు ఇన్‌స్పెక్టర్. చెన్నైలో విధులు నిర్వహిస్తుంటాడు. అతను అనాథగా పెరగడం వల్ల కఠిన స్వభావానికి అలవాటుపడతాడు. ఇంతలో సిటీలో నేరాలను అడ్డూ అదుపూ లేకుండా చేసే ఒక గ్యాంగ్ ను పట్టుకోవడానికి సిద్దపడతాడు. మరో వైపు ఒక అమ్మాయి కూడా ఇతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఓ వైపు క్రిమినల్స్, మరో వైపు లవ్ స్టోరీని ఎలా బ్యాలెన్స్ చేశాడానేదే ఈ స్టోరీ. ఈ సినిమా jio hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘ది స్మైల్ మ్యాన్’ (The Smile Man)
2024లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా శరత్‌కుమార్ నటించిన 150వ చిత్రం. ఇందులో సిజా రోజ్, ఇనియా, కలైయరసన్, జార్జ్ మరియన్ వంటి నటులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ చిదంబరం నెడుమారన్ (శరత్‌కుమార్) అనే పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను ఆల్జ్‌హైమర్స్ వ్యాధితో బాధపడుతూ, ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ మూవీ Aha Tamilలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘వెట్టయ్యాడు విలయ్యాడు'(Vettayadu Vilayadu)
2006 లో విడుదలైన ఈ తమిళ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.ఇందులో కమల్ హాసన్, జ్యోతిక, ప్రకాష్ రాజ్, డానియల్ బలాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘రాఘవన్ ‘పేరుతో డబ్ చేయబడింది. ఇది ఇద్దరు సీరియల్ కిల్లర్స్ ను పట్టుకోవడానికి ఒక పోలీసు అధికారి చేసే పోరాటం గురించిన ఉత్కంఠభరిత కథ. జీ 5 (Zee 5) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
‘రాట్ససన్’ (Ratsasan)
2018లో విడుదలైన ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి రామ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు విశాల్, అమలా పాల్, సరవణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో “రాక్షసుడు” పేరుతో డబ్ చేయబడింది. ఇది ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి, కొత్తగా వచ్చిన ఒక పోలీసు అధికారి చేసే పోరాటం గురించిన ఉత్కంఠభరితమైన కథ. ఈ సినిమా jio hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : తల్లిని ఇంటరాగేషన్ చేసే కొడుకులు … ముసుగు వెనుక గందరగోళం .. ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్