UP Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. పదేళ్ల క్రితం తన తల్లిపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి నిందితుడిని హత్య చేశాడు. ఈ హృదయవిదారక ఘటన లఖ్‌నవూ నగరంలోని ముంశీపులియా ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
సోను కశ్యప్ అనే యువకుడు తన తల్లిపై జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయాడు. సుమారు పదేళ్ల క్రితం, మనోజ్ అనే వ్యక్తి సోనూతల్లిని కొట్టాడని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత.. మనోజ్ అక్కడి నుండి తప్పించుకుని మరోచోటికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచీ అతడిని వదలకూడదని సంకల్పించుకున్న సోను, అతడి కోసం పదేళ్లుగా వెతుకుతూ ఉన్నాడు.
మళ్లీ ఎదురైన క్షణం..
సుమారు మూడు నెలల క్రితం సోను, మనోజ్ మళ్లీ లఖ్‌నవూలోని ముంశీపులియాలో.. ఉంటున్నాడని తెలుసుకున్నాడు. తన తల్లిని హతమార్చిన వ్యక్తిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.
స్నేహితులతో కలసి..
మందు పార్టీ ఇస్తానని చెప్పి రంజిత్, ఆదిల్ సలామ్, రెహ్మత్, అలీలను ఈ కుట్రలో భాగస్వాములుగా మార్చుకున్నాడు సోను. హత్యకు ముందు సుదీర్ఘంగా ప్రణాళిక రచించి, మనోజ్ ఒంటరిగా ఉన్న సమయంలో.. వారంతా కలిసి అతడిపై దాడికి దిగారు.
ఇనుపరాడ్లతో దారుణంగా దాడి..
సోను, అతని స్నేహితులు అతడిపై ఇనుపరాడ్లతో.. విచక్షణా రహితంగా దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరిచి అక్కడినుంచి పారిపోయారు. స్థానికులు స్పందించి మనోజ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Also Read: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య, మృతదేహం ఇంట్లోనే పాతి, అక్కడి నుంచి..
సెల్ఫీలు – ఆధారంగా ముఠా అరెస్ట్..
హత్య అనంతరం నిందితులు పార్టీ చేసుకుంటూ తీసుకున్న ఫోటోలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోను కశ్యప్‌తో పాటు రంజిత్, ఆదిల్, రెహ్మత్, అలీ అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఇనుపరాడ్లు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.