Kamal Chandra Bhanj Dev: వరంగల్ జిల్లాలో కాకతీయ రాజుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ పర్యటిస్తున్నారు. చారిత్రిక నేపథ్యం కలిగిన ఓరుగల్లు ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగానే భద్రకాళి ఆలయం, వేయి స్థంబాల ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కమల్ చంద్రకు హన్మకొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్‌లు ఘనస్వాగతం పలికారు. కాకతీయ వారసునితో బీఆర్ఎస్ శ్రేణులు పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ చంద్ర భంజ్ దేవ్ మాట్లాడారు.
⦿ నేను ఒక సేవకుడ్ని..
‘నేను రాజును కాదు.. నేను ఒక సేవకున్ని. భగవంతుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. సేవకునిగా ఉన్న వారికే రాజుగా ఎలా ఉండాలో తెలుస్తుంది. రాజు అనేవాడు ప్రజలకు సేవకుడు. కాకతీయులది చాలా పెద్ద సామ్రాజ్యం. 52 శక్తి పీఠాలలో నేను ఒక పూజారిని మాత్రమే. నాకు కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. జీవన విధానంలో ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి. పిల్లలను కూడా మనమే పాడు చేస్తున్నాం. హాలిడేస్ వస్తే మ్యూజియంకు వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లాలి. సినిమాలు, రెస్టారెంట్ లు, వండర్ లా వంటి మన సంస్కృతితో సంబంధం లేని విషయాలు పిల్లలకు అలవాటు చేస్తున్నాం’ అని ఆయన అన్నారు.
⦿ పాశ్చాత్య సంస్కృతిని ఆచరిస్తున్నాం..
పాశ్చాత్య దేశాలు మన సంస్కృతిని గౌరవిస్తుంటే మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతిలో పడిపోతున్నాం. ప్రశ్నించడం చాలా సులువు. కానీ ఆచరించడం చాలా కష్టం. పూరి జగన్నాథ్, ఇలాంటి ప్రదేశాల్లో ధోతి పైజామ్ లు మాత్రమే ధరిస్తారు. అది మన దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాల గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. మన వేష దారణను బట్టి మనం ఏ దేశానికి చెందినవారమని గుర్తిస్తారు. నేను విదేశాలలో చదువుకున్నప్పుడు అనేక అంశాలను పరిశీలించాను. అక్కడ విద్యార్థులకు నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు’ అని చెప్పారు.
Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..
‘లండన్‌లో చదివి ఇక్కడికొచ్చాక.. ఎంతో అవినీతిని ఇక్కడ గమనించాను. నా కల్చర్ తర్వాతే ఎడ్యుకేషన్. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకొని నువ్వు ప్రపంచానికి ఏమి చేయగలుగుతావో అన్నదాన్ని బట్టి మీ ఎడ్యుకేషన్ స్థాయి నిర్ధారింపబడుతుంది. వారసత్వ సంపదను సంరక్షించుకోవడమే మన కర్తవ్యం’ అని కమల్ చంద్ర భంజ్ దేవ్ వ్యాఖ్యానించారు.
Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..