Vaibhav – MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు. ఏదో ఒక అంశం వైభవ్ సూర్య వంశీ చుట్టూ తిరుగుతోంది. నిన్నటి వరకు ప్రీతి జింటా ను వైభవ్ సూర్య వంశీ హగ్ చేసుకున్నాడని సోషల్ మీడియాలో… వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో.. 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సారథి మహేంద్ర సింగ్ ధోని కాళ్లు మొక్కాడు వైభవ్ సూర్యవంశీ. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Sanjiv Goenka : 27 కోట్లు బొక్క… చేసేదేమీ లేక పంత్ కు మసాజ్ చేస్తున్న లక్నో ఓనర్
ధోని కాళ్లు పట్టుకున్న 14 ఏళ్ల కుర్రాడు వైభవ్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మంగళవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 62వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడి గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై 6 వికెట్ల తేడాతో… ఎలాంటి లాభం లేని విజయాన్ని నమోదు చేసుకుంది ఈ రాజస్థాన్ రాయల్స్. ఈ టోర్నమెంట్ లో… చేజింగ్ లో దారుణంగా ఓడిపోతున్న రాజస్థాన్ రాయల్స్ ఇవాల్టి మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా రాణించింది. పరువు నిలబెట్టుకుంది.
అయితే ఈ మ్యాచ్ పూర్తి అయిన తర్వాత 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ చేసిన పని సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. స్టేడియం నుంచి ప్లేయర్లందరూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న నేపథ్యంలో… వైభవ్ సూర్య వంశీ మాత్రం ఓ అదిరిపోయే పని చేశాడు. వెంటనే వెళ్లి మహేంద్రసింగ్ ధోని కాళ్ళ పైన పడిపోయాడు వైభవ్ సూర్య వంశీ. అయితే ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని వెంటనే అలర్ట్ అయి.. కాళ్లు మొక్కకూడదని రిక్వెస్ట్ చేశాడు. కానీ మీరు మా బాస్ అంటూ వైభవ్ సూర్య వంశీ.. మహేంద్ర సింగ్ ధోని ఆశీర్వాదం తీసుకున్నాడు. అక్కడే ఉన్న యశస్వి జైస్వాల్… మహేంద్ర సింగ్ ధోనీకి దేవుడి తరహాలో దండం పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎలిమినేట్ అయిన చెన్నై, రాజస్థాన్ రాయల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలిమినేట్ గా.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇంటి దారి పట్టింది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్లు ఆడి కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. మొత్తం 10 మ్యాచ్లలో దారుణంగా ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. అటు రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచులలో 10 ఓటమిపాలైంది. నాలుగింట గెలిచింది రాజస్థాన్ రాయల్స్.
Also Read: Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా
This is the culture of India, Vaibhav Suryavanshi took blessings of MS Dhoni by touching his feet..🙏#CSKvsRR "Vaibhav Suryavanshi" #MumbaiRains Dhoni Kiara Parag Sanctions "Vaibhav Suryavanshi" Ahmedabad Thala pic.twitter.com/oU6yhi8FDl
— Sahil Khanna (@SahilKh83593460) May 20, 2025