BigTV English

Hyderabad Digital Services: మీది హైదరాబాదా? జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. కాలు కదపక్కర్లేదు ఇక!

Hyderabad Digital Services: మీది హైదరాబాదా? జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. కాలు కదపక్కర్లేదు ఇక!

Hyderabad Digital Services: మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మాత్రం మీకోసమే. మీరు కాలు కదపకుండా, మీ పనులు చక్కబెట్టుకోవచ్చు. ఆ పని ఏమిటో తెలుసుకుంటే, మీ మోముపై చిరునవ్వు రావడం ఖాయం. ఇంతకు అదేమిటో తెలుసుకునేందుకు ఈ కథనం పూర్తిగా చదవండి.


హైదరాబాద్ నగర వాసులకు ఇది నిజంగా సంతోషకరమైన విషయం. GHMC వారి ఆస్తి పన్ను సేవలను పూర్తిగా డిజిటల్‌గా మార్చేసింది. ఇకపై మీసేవా సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు. కాస్త ఇంట్లో కూర్చుని క్లిక్ చేస్తే చాలు.. మీ పని అయిపోయినట్లే!

అన్నీ సేవలు ఆన్లైన్ లోనే..
ప్రజలకు సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పాలనను అభివృద్ధి చేసేందుకు, పౌర -స్నేహపూర్వక సేవల దిశగా అడుగులు వేస్తూ, GHMC ఇప్పుడు ఆస్తి పన్నుకు సంబంధించిన అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై GHMC కార్యాలయాలు, మీసేవా సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. GHMC అధికారిక వెబ్‌సైట్‌ (www.ghmc.gov.in) ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లోనే సేవలు పొందవచ్చు. దీని ద్వారా సమయాన్ని, శ్రమను ఆదా చేసుకోవచ్చు.


ఇంత ఈజీగానా?
GHMC అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం, ఈ డిజిటల్ సేవల లక్ష్యం వినియోగదారులకు వేగవంతమైన, అవాంతరాలేని సేవలను అందించడం. ఈ చొరవతోపాటు దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేయడం, అవసరమైన పత్రాలను సులభంగా అప్‌లోడ్ చేసుకునే విధంగా వ్యవస్థను రూపొందించారు.

దరఖాస్తుదారులు తమ ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (PTIN) తో లాగిన్ అయి, అభ్యర్థన రకాన్ని ఎంచుకుని, సేల్ డీడ్, ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తు సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపబడుతుంది. వారు పరిశీలించి ఆమోదిస్తారు. దీనితో ఇక ఫైళ్ల చుట్టూ తిరుగుతూ లేఖల కోసం వేచిచూసే రోజులు పోయినట్లే అంటున్నారు నగర వాసులు.

Also Read: AP Tourism Spots: ఏపీలో కులుమనాలి ఉందని తెలుసా? ఇక్కడ ఆ ఒక్కటి తప్పక చూడాల్సిందే!

అంతేకాదు, ప్రస్తుతం ఆస్తి మ్యుటేషన్ సేవలను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో ఇవి కూడా ప్రారంభమవుతాయని GHMC అధికారికంగా ప్రకటించింది. ఇది GHMC చేస్తున్న విస్తృత డిజిటల్ చొరవల్లో భాగమే. పౌర పరిపాలనలో పారదర్శకత, వేగవంతత, అర్హతతో కూడిన సేవల లక్ష్యంతో ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రజల జీవితం తేలిక చేయాలనే దిశగా GHMC తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాదులో డిజిటల్ పరిపాలనకు ఒక మైలురాయిగా మారనుంది. ఇప్పటికైనా GHMC వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఆస్తి వివరాలను ఒకసారి పరిశీలించి, అవసరమైతే కొత్త సేవలను ఉపయోగించుకోండి. ఇకపై నగర పాలక సంస్థ కార్యాలయాలను చుట్టూ తిరుగే పనికే కాదు, టెక్నాలజీతో పనిచేసే రోజులు వచ్చేశాయంటే అతిశయోక్తి కాదు!

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×