Mohanlal: సినిమాల విషయంలో ప్రతీ చిన్న విషయాన్ని ప్రేక్షకులు చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. దానివల్లే సినిమాల వల్ల కాంట్రవర్సీలు క్రియేట్ అవుతుంటాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా ఇలాంటి కాంట్రవర్సీల నుండి తప్పించుకోలేవు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ సినిమాకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఎల్2 ఎంపురాన్’ తాజాగా విడుదలయ్యింది. ఆ మూవీ విడుదలకు ముందు నుండి మాత్రమే కాదు.. విడుదలయిన తర్వాత కూడా కాంట్రవర్సీలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ విషయంపై స్పందించడానికి మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చాడు.
ఆ సీన్స్ వద్దు
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల గురించి ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాలో చూపించాడని పృథ్విరాజ్ సుకుమార్, మోహన్‌లాల్‌పై సంఘ్ పరివార్ సపోర్టర్స్ సీరియస్ అవుతున్నారు. మార్చి 27న ఈ మూవీ విడుదల కాగా అప్పటినుండి గుజరాత్ అల్లర్ల గురించి ఉన్న రిఫరెన్స్ సీన్లపై ప్రేక్షకులు మండిపడుతూనే ఉన్నారు. అలా విడుదలయి రోజు నుండే అభ్యంతరాలు రావడంతో ఈ సీన్స్‌ను వెంటనే తొలగించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీనిపై నిర్మాత కూడా స్పందిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకంటామని అన్నారు. ఇక మోహన్‌లాల్ కూడా ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సీన్స్‌పై స్పందిస్తూ వారికి క్షమాపణలు చెప్పాడు.
అందరం బాధ్యులమే
‘ఎల్2 ఎంపురాన్’ (L2 Empuraan) సినిమాపై క్రియేట్ అయిన కాంట్రవర్సీపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ షేర్ చేశాడు మోహన్‌లాల్ (Mohanlal). ‘ఒక ఆర్టిస్ట్‌గా నా సినిమాలు ఎలాంటి రాజకీయ, ఐడియాలజీ, మత గొడలను ప్రమోట్ చేయకుండా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. అలా నా ప్రియమైన ప్రేక్షకులకు నేను, నా టీమ్ డిసప్పాయింట్ చేసినందుకు రిగ్రెట్ అవుతున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరు దీని బాధ్యులు. దీంతో టీమ్ అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. అలాంటి ప్రేరేపించే నెగిటివ్ సీన్స్‌ను తీసేయాలని నిర్ణయించాం’ అని చెప్పుకొచ్చారు మోహన్ లాల్. దీంతో ఈ హీరో ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ప్రేక్షకులు ఈ నెగిటివిటీ ఆపేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read: ఆ సీన్స్ మార్చాలని పృథ్విరాజ్‌పై నిర్మాత ఒత్తిడి.. అసలు ఏమైంది.?
సీబీఎఫ్‌సీ ఆదేశం
ఇప్పటికే ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ ఆర్టికల్‌ను పబ్లిక్ చేయగా అది కేరళ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఈ సినిమాకు మరోసారి కట్స్ చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) రంగంలోకి దిగింది. మరోసారి సినిమాను చూసి ప్రస్తుతం ప్రేక్షకులకు అభ్యంతరకరంగా ఉన్న సీన్స్ విషయంలో 17 మార్పులు చేయాలని ఆదేశించింది. ఒకవేళ సెన్సార్ బోర్డ్ చెప్పిన మార్పులను మేకర్స్ పూర్తి చేసి సోమవారం వరకు వారికి అందిస్తే వచ్చే వారంలోపు ఈ సీన్స్ అన్నీ తొలగిపోయి లేటెస్ట్ వర్షన్‌తో ‘ఎల్2 ఎంపురాన్’ థియేటర్లలో రన్ అవుతుంది. మొత్తానికి మంచి టాక్‌తో దూసుకుపోతున్న ‘ఎల్2 ఎంపురాన్’కు ఇలాంటి సమస్యలు రావడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యింది.