BigTV English

Teenagers shoot Doctor: ఆస్పత్రిలో డాక్టర్‌ను హత్య చేసిన ఇద్దరు టీనేజర్లు.. చికిత్స కోసం వెళ్లి తుపాకీతో కాల్పులు

Teenagers shoot Doctor: ఆస్పత్రిలో డాక్టర్‌ను హత్య చేసిన ఇద్దరు టీనేజర్లు.. చికిత్స కోసం వెళ్లి తుపాకీతో కాల్పులు

Teenagers shoot Doctor| ఆస్పత్రుల్లో డాక్టర్లపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆస్పత్రుల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. ఇదంతా పైకి కనిపిస్తున్నా.. దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు టీనేజర్లు ఒక డాక్టర్ ని తుపాకీ కాల్చిచంపారు. ఢిల్లీలోని జైత్ పూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జైత్ పూర్ ప్రాంతంలో నిమా హాస్పిటల్ ఉంది. బుధవారం, అక్టోబర్ 2, 2024 అర్ధరాత్రి నిమా ఆస్పత్రిలో ఇద్దరు టీనేజర్లు వచ్చారు. అందులో ఒకరి కాలికి గాయం ఉంది. ఆ గాయానికి చికిత్స కోసం వచ్చిన ఆ ఇద్దరు టీనేజర్లు నర్సు వద్ద చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత డ్యూటీలో ఉన్న యునానీ మెడిసిన్ వైద్యుడు, డాక్టర్ జావెద్ అఖ్తర్ వద్ద ప్రిస్క్రిబ్షన్ రాయించుకునేందుకు వెళ్లారు.

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..


ఆ ఇద్దరు కుర్రాళ్లు డాక్టర్ గదిలోకి వెళ్లిన కొద్దిసేపు తరువాత బయట డ్యూటీలో ఉన్న నర్సు గజాలా పర్వీన్, డాక్టర్ కామిల్ కు తుపాకీ కాల్పులు శబ్దాలు వినిపించాయి. దీంతో వారిద్దరూ లోపలికి వెళ్లి చూడగా డాక్టర్ జావెద్ అఖ్తర్ రక్తపు మడుగులో కింద పడి ఉన్నాడు. ఆ ఇద్దరు టీనేజర్లు చేతిలో తుపాకులతో ఉన్నారు. కాల్పులు చేసిన తరువాత ఆ ఇద్దరు ఆస్పత్రి సిబ్బందిని తుపాకీతో బెదిరించి అక్కడి నుంచి బయటికి పారిపోయారు. ఈ ఘటన గురించి ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఆస్పత్రి సిసిటీవి వీడియోలు పరిశీలించగా.. ఆ ఇద్దరు హంతకుడు ఒక రోజు ముందు కూడా ఆస్పత్రికి వచ్చినట్లు తెలిసింది.

ఆస్పత్రి సిబ్బంది తెలిపిన ఆచూకీ ప్రకారం.. ఇద్దరు హంతకుల వయసు 15 నుంచి 17 సంవత్సరాలు ఉంటుంది. వారిద్దరూ ఒకరోజు ముందు ఆస్పత్రికి వచ్చి రెక్కీ చేసిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే ఇద్దరినీ పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read:  ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

రెండు నెలల క్రితం బెంగాల్ రాజధాని కోల్‌కతా లో ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా కోల్‌కతా లోని డాక్టర్లు రోడ్లపై నిరసనకు దిగారు. డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన శిక్షలు ఉండేవిధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. విధులు బహిష్కరించారు. దేశవ్యాప్తంగా కోల్ కతా డాక్టర్ల నిరసనకు మద్దతు లభించింది.

ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో డాక్టర్ హత్య ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ గవర్నర్ పాలనపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీలో నేర ఘటనలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో శాంతి భద్రతల నిర్వహణలో ఢిల్లీ గవర్నర్ విఫమయ్యారని ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నాయకులు విరుచుకుపడుతున్నారు. డాక్టర్ హత్యకు బాధ్యత ఎవరు వహిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Related News

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Big Stories

×