Girl Dies in Swimming Pool: నెల్లూరులో విషాదం నెలకొంది. ఈత నేర్చుకోవడానికి వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిన్న సప్తగిరి కాలనీలోని వంశీ కృష్ణ, ఆది లక్ష్మీ తమ కూతురు మనస్వి(9)ని ఈత నేర్పించడానికి ఏసీ సుబ్బారెడ్డి స్విమ్మింగ్ పూల్‌కు పంపించారు. అయితే ఈత నేర్చుకునేందుకు కొలనులోకి దిగిన మనస్వి ప్రాణాలు కోల్పోయింది. ఈత నేర్చుకోవడానికి వెళ్లిన తొలిరోజునే తమ కూతురు చనిపోవడంతో మనస్వి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని బంధువులతో కలిసి చిన్నార తల్లిదండ్రులు ఏసీ సుబ్బారెడ్డి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆందోళనకు దిగారు. తమకు చెప్పకుండానే మనస్విని హాస్పిటల్‌కు తరలిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూల్‌లోకి దిగిన తర్వాత మనస్వికి ఫిట్స్ రావడం వల్ల చనిపోయి ఉంటుందని నిర్వహకులు చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు మనస్వికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని, పూల్ నిర్వహకుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు.
ALSO READ: పసికందును చంపేసిన తల్లి
మనస్వి చనిపోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ఘటనలో పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొసం హాస్పిటల్‌కు తరలించారు. ఆ రిపోర్ట్ వస్తే మనస్వి చనిపోవడానికి కారణం ఏంటనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత పూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పయిందని తేలితే మాత్రం కఠిన చర్యలు తీసకుంటామని స్పష్టం చేశారు.