BigTV English

Co-director Shiva Suicide: హైదరాబాద్‌లో కో- డైరెక్టర్ సూసైడ్, ఇదీ అసలు కథ..?

Co-director Shiva Suicide: హైదరాబాద్‌లో కో- డైరెక్టర్ సూసైడ్, ఇదీ అసలు కథ..?

Co-director Shiva Suicide: చిత్ర పరిశ్రమపై ఇష్టంతో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్ వస్తారు. అందులో ఎవరికి ఇష్టమైన రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, చేతిలో చిల్లిగవ్వ లేని సందర్భాలు కోకొల్లలు. ఒకవేళ అవకాశాలు దొరికినా, సక్సెస్ రేటు చాలా తక్కువ. ఇష్టమైనది కావడంతో కష్టపడైనా నెట్టుకుంటూ వచ్చేస్తారు. ఈ క్రమంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు.


తాజాగా టాలీవుడ్‌కి కో- డైరెక్టర్ శివ సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌‌లోని బోరబండలోని ఆయన ఉంటున్నాడు. ఆయన ఆత్మహత్య వెనుక కుటుంబ కలహాలే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా బందరు ప్రాంతానికి చెందిన ఎస్. శివ, బోరబండలోని రాజ్ నగర్ బస్తీలో ఉంటున్నాడు. పలు సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేశాడు.

ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు చేశాడు. అయితే భార్యతో వివాదాల కారణంగా ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. తొలుత కృష్ణానగర్‌లో ఆయన ఉండేవాడు. తర్వాత బోరబండకు మారాడు. అయితే మూడురోజులుగా ఆయన ఉన్న ఇంట్లో నుంచి తీవ్ర దుర్గందం వస్తోంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూమ్ తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఉరి వేసుకుని కనిపించాడు శివ. అక్కడ ఐదు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Also Read: ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో కేసీఆర్ ఓ ఉదాహరణ

అనారోగ్యం, ఒంటరి తనం కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చాలా షార్ట్ ఫిల్మ్స్‌కు డైరెక్టర్‌, కో-డైరెక్టర్‌గా వ్యవహరించారాయన. అంతేకాదు పలు టాలీవుడ్ సినిమాలకు పని చేశాడు కూడా.

Tags

Related News

Jagtial District: మా నాన్నను చంపేశారు.. భూమి లాక్కున్నారు, ప్రజావాణిలో చిన్నారుల ఆవేదన

Hyderabad News: హైదరాబాద్‌లో ఘోరం.. ఆరుగురు జువైనల్స్‌పై లైంగిక దాడి!

Kadapa Crime News: కడపలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి, అసలు సమస్య అదేనా?

Chirala Beach Accident: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Tirupati Drug Case: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్

Siddipet Crime: పెళ్లయిన 13 రోజులకే ప్రెగ్నెంట్.. డాక్టర్ సమాధానంతో భర్త షాక్, ఏం జరిగింది?

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

Big Stories

×