E-Paper
Advertisement

Suicide Bomb Blast in Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు మృతి!

Suicide Bomb Blast in Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు మృతి!
Advertisement

Suicide Bomb Blast in Pakistan: పాకిస్తాన్ లోని కరాచీలో శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. విదేశీయులు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ దాడిలో సూసైడ్ బాంబర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది. లాంధీలోని మన్సేరా కాలనీలో దాడి జరిగింది. ఈ దాడి సమయంలో వ్యాన్ ఐదుగురు విదేశీయులు ఉండగా.. వారంతా తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు ఒక నివేదిక పేర్కొంది. వారంతా జపాన్ కు చెందినవారుగా గుర్తించారు.

suicide bomb attack in karachi
suicide bomb attack in karachi

Also Read: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి, టార్గెట్ ఎయిర్ బేస్‌లు

Advertisement

బైక్ పై వచ్చిన ఉగ్రవాదులు వ్యాన్ లక్ష్యంగా దాడి చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. తొలుత కాల్పుల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యాయరని, ఆ తర్వాత బాంబ్ ను పేల్చినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారి వద్ద గ్రెనేడ్లు, కలాష్ని కోవ్ తో నిండి ఉన్న ఒక బ్యాగ్ ను గుర్తించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది శరీరానికి బాంబ్ జాకెట్, గ్రెనేడ్ ఉన్నట్లు తెలిపారు. బాంబ్ స్క్వాడ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.

Tags

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×