BigTV English

SBI Jobs: SBIలో భారీగా జాబ్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు.. డోంట్ మిస్

SBI Jobs: SBIలో భారీగా జాబ్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు.. డోంట్ మిస్

SBI Jobs: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) భారీ ఖాళీలతో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.


⦿  మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2964 (తెలుగు రాష్ట్రాల్లో కూడా వెకెన్సీలు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్ లో 233 పోస్టులు, అమరావతి సర్కిల్ లో 186 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.)

⦿ విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. (వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు)


⦿ రాష్ట్రాల వారీగా వెకెన్సీలు: అహ్మదాబాద్‌- 240, ఆంధ్రప్రదేశ్- 180, కర్ణాటక- 250, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్- 200, ఒడిశా- 100, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్, లడఖ్‌, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌- 80, తమిళనాడు, పుదుచ్చేరి- 120, నార్త్‌ ఈస్ట్రన్‌- 100, తెలంగాణ- 230, రాజస్తాన్‌- 200, కోల్‌కతా- 150, లఖ్‌నవూ-280, మహారాష్ట్ర- 250, ముంబయి మెట్రో(మహారాష్ట్ర, గోవా)- 100, న్యూదిల్లీ- 30, తిరువనంతపురం- 90 వెకెన్సీ ఉన్నాయి.

Also Read: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.55,000 జీతం, ఈ అర్హత ఉంటే ఎనఫ్

⦿ తెలంగాణ హైదరాబాద్ సర్కిల్ లో 233 పోస్టులున్నాయి.

⦿ ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్కిల్ లో 186 పోస్టులున్నాయి.

⦿  దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 9

⦿  దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 29

⦿  వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 1995 మే 1 నుంచి  2004 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

⦿ జీతం: సెలెక్ట్ అయిన వారికి రూ.48,480 జీతం ఉంటుంది.

⦿ ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

⦿ ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆబ్జెక్టివ్ విధానంలో 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో నాలుగు విభాలుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలకు గానూ.. 30 మార్కులు; బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు.. 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/ ఎకానమీ- 30 ప్రశ్నలు 30 మార్కులకు నిర్వహిస్తారు.  కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు 20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది.

⦿ ఎగ్జామ్ సెంటర్స్హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.

⦿ దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

⦿ దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతరలకు రూ.750 ఫీజు ఉంటుంది.

⦿ హాల్ టికెట్ జులై నెలలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

⦿ జులై నెలలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది.

నోటిఫికేష్ ముఖ్య సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

Also Read: DRDO Recruitment: డీఆర్‌డీవోలో 148 ఉద్యోగాలు.. శాలరీ రూ.56,100.. దరఖాస్తుకు లాస్ట్ డేట్?

⦿ అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in

⦿ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2964

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 29

Related News

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో

JEE Main-2026: ఐఐటీ మెయిన్స్ అభ్యర్థులు అలర్ట్.. NTA కీలక సూచనలు

APSRTC: ఇది గోల్డెన్ ఛాన్స్.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు, ఇంకా 4 రోజులే గడువు

AIIMS Mangalagiri: మంగళగిరిలో ఉద్యోగాలు.. ఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్, రూ.1,50,000 జీతం

BEL Notification: బీటెక్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.40వేలు, ఇంకెందుకు ఆలస్యం

IBPS Notification: ఇంకా ఒక్క రోజే.. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మళ్లీ రాదు, డిగ్రీ ఉంటే జాబ్ ఉన్నట్టే..!

RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు

Big Stories

×