Anantapur News: ఏపీలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారా? డబ్బులు తీసుకున్న పాపానికి నడిరోడ్డు మీద బాధితులపై దాడులకు తెగబడుతున్నారా? ఇటీవల జరుగుతున్న ఘటనలు దేనికి సంకేతం? అనంతపురం పట్టణంలో అలాంటి సీన్ రిపీట్ అయ్యిందా? ఇంతకీ ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకూ శృతి మించుతున్నాయి. కేవలం అనంతపురానికి మాత్రమే పరిమితం కాలేదు. మొన్నటికి మొన్న కుప్పంలో కూడా ఓ మహిళను చెట్టుకి కట్టేశారు. వీరికి అడ్డుకోకుంటే పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఉంటుందని అంటున్నారు.
అనంతపురం పట్టణంలో వడ్డీ చెల్లించలేదని ఓ వ్యక్తిపై దాడి చేశారు వడ్డీ వ్యాపారులు. పాతూరులోని ఉమానగర్ ప్రాంతానికి చెందిన బాబ్‌జాన్ బంగారు షాపు నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల కిందట భవానీ నగర్‌కి చెందిన వడ్డీ వ్యాపారి తిరుపాలు వద్ద రూ.10 వడ్డీతో రెండు లక్షలు అప్పు తీసుకున్నాడు. మొదట్లో వడ్డీ చెల్లించిన బాధితుడు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించ వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.
ఇప్పటివరకు దాదాపు రూ.10 లక్షలు వడ్డీ రూపంలో చెల్లించాడు. అయితే సోమవారం బాబ్‌జాన్‌తో వడ్డీవ్యాపారి కొడుకు సూరి, అతడి అనుచరులు వాగ్వాదానికి దిగారు. వారిలో ఒకడు బాధితుడు బాబ్‌జాన్‌పై చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. ఆపై కాళ్లు, చేతులతో ఆ వ్యక్తిపై దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి.
ALSO READ: గొడ్డలితో భర్తను నరికి చంపిన ఇద్దరు భార్యలు
దీంతో బాధితుడితోపాటు మరికొందరు బంగారు వ్యాపారులు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకుని వడ్డీ వ్యాపారుల దాష్టీకాలపై ఫిర్యాదు చేశారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలను భరించలేకపోతున్నామని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్డీ డబ్బులు సకాలంలో చెల్లించపోతే భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు మహిళలను వేధిస్తున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు వడ్డీ వ్యాపారి తిరుపాల్, అతని కొడుకు సూరి, అనుచరులు శేషుతో పాటు మరోముగ్గురి పై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇటీవల సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో నారాయణపురం గ్రామంలో స్థానిక వడ్డీ వ్యాపారి అప్పు తీర్చకపోవడంతో ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు. ఆ తర్వాత దానికి సంబంధించి వీడియో వెలుగులోకి రావడంతో సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. బాధిత మహిళతో స్వయంగా మాట్లాడారు. వెంటనే బాధితులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.
అనంతపురంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు
వడ్డీ చెల్లింపు కాస్త ఆలస్యం అయినందుకు బంగారు వ్యాపారిపై దాడి
పాతూరుకు చెందిన తిరుపాల్ వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్న బంగారు వ్యాపారి బాబ్‌జాన్
వంద రూపాయలకు నెలకు రూ.10 చొప్పున వడ్డీ చెల్లిస్తూ వస్తున్న వ్యాపారి
ఇప్పటికే వడ్డీ లక్షలు… pic.twitter.com/tetDJ0w54y
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2025