Ghaziabad Crime News: ఒకొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో భర్తను చంపిన భార్యని చూశాం. కానీ తనకు వచ్చిన జబ్బు తగ్గదని భావించాడు ఓ వ్యక్తి. దానికి ఎంత ఖర్చు చేసినా మనీ వేస్ట్ అవుతుందని ఆలోచనకు వచ్చాడు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. తొలుత భార్యని చంపాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఆమె భర్త. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగు చూసింది.
ఏం జరిగింది?
పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు కుల్‌దీప్ త్యాగి. వయస్సు 57 ఏళ్లు ఉంటుంది. ఆయన రియల్టర్ కూడా. త్యాగి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఘజియాబాద్‌లో ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు క్రమంగా పెరిగారు. హాయిగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. ఇటీవల త్యాగి ఆసుపత్రికి వెళ్లి మెడికల్ చెకప్ చేయించుకున్నాడు. అందులో ఆయనకు క్యాన్సర్ వచ్చిందని తేలింది.
త్యాగిని పరీక్షించిన డాక్టర్లు ఆయనకు ఏం చెప్పారో తెలీదు. అప్పటి నుంచి మనస్తాపానికి గురయ్యాడు. తన జబ్బుకు డబ్బు ఎంత ఖర్చు పెట్టినా ఫలితం ఉండదని నిర్ణయించుకున్నాడు. చనిపోవాలని భావించాడు. అలాగని భార్యని వదిలేసి ఉండలేని పరిస్థితి. బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌కి గన్ పట్టుకుని వెళ్లాడు. ఆ తర్వాత భార్యని పిలిచాడు.
త్యాగికి డాక్టర్లు ఏం చెప్పారు?
అక్కడికి ఆమె రాగానే తన దగ్గరున్న గన్‌తో భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ సౌండ్ వినగానే తొలి అంతస్తులో ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పరిగెత్తుకుంటూ కిందికి దిగొచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు విగతజీవులుగా పడివున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: హైదరాబాద్ లో కొత్త రకం డ్రగ్స్, టార్గెట్ టెక్కీలే?
పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను ఆసుపత్రికి తరలిచారు. ఘటన జరిగిన స్థలంలో సూసైడ్ నోట్ కనిపించింది. తాను కేన్సర్‌తో బాధపడుతున్నానని రాసుంది. కుటుంబానికి తాను భారం కాకూడదని భావించానని, ట్రీట్‌మెంట్‌కు డబ్బులు వృథా అవ్వకూడదని భావించానని రాసుకొచ్చాడు. వాస్తవానికి తనకు కేన్సర్ ఉందన్న విషయం కుటుంబానికి తెలియదన్నాడు. ఈ కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు అందులో ప్రస్తావించాడు.
త్యాగి చనిపోయే ముందు, తన భార్యని చంపేశాడని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, ఫోరెన్సీక్ టీమ్ ఆ ప్రాంతానికి చేరుకుని ఆధారాలను సేకరించిందన్నారు. త్యాగికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ఇంకా లభించలేదన్నారు. వాటిని వెతికే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు పోలీసులు.
త్యాగికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ఇంకా లభించలేదన్నారు. వాటిని వెతికే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు పోలీసులు. త్యాగి చేసిన పనిని తప్పుబట్టిన వాళ్లు లేకపోలేదు. అతనికి జబ్బు ఉంటే, భార్య ఏం చేసిందని అంటున్నారు. అనవసరంగా ఆమెని పొట్టనపెట్టుకున్నాడని అంటున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో.