BigTV English

Wife Stage Husband Murder: భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య.. చిన్నపిల్ల ద్వారా బయటపడిన బండారం

Wife Stage Husband Murder: భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య.. చిన్నపిల్ల ద్వారా బయటపడిన బండారం

Wife Stage Husband Murder| వివాహేతర సంబంధం కోసం ఇద్దరు పిల్లలు ఉన్న ఒక మహిళ తన భర్తను కుట్ర చేసి హత్య చేయించింది. ఆ తరువాత తన భర్త గుండె పోటుతో చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించింది. కానీ పోలీసులు ఈ కేసులో అనుమానంగా ఉండడంతో విచారణలో అనూహ్యంగా ఒక చిన్నపిల్ల వాంగ్మూలం హంతకులను పట్టించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవు నగరానికి చెందిన శత్రుఘన్ రాథోడ్ (50) ఒక వ్యాపారి. అతను లేటు వయసులో రాఖీ (35) అనే యువతితో పెళ్లి చేసుకున్నాడు. వారి ద్దరికీ ఇద్దరు సంతానం. ఒక పాప (9), బాబు (6). అయితే పెళ్లి తరువాత రాఖీ తన భర్తతో కాపురం పట్ల అసంతృప్తిగా ఉండేది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.

ఈక్రమంలో రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో నివసించే ధర్మేంద్ర రాథోడ్ (40) తో రాఖీకి పరిచయం ఏర్పడింది. నిజానికి ధర్మేంద్ర తన భర్త శత్రుఘన్ కి సోదరుడి వరుస. దీంతో అతను తరుచూ వారింటికి వచ్చేవాడు. ధర్మేంద్ర కు సొంతంతా ట్రావెల్ బిజినెస్ ఆఫీస్ ఉంది. ధర్మేంద్ర సంపాదన ఎక్కువ ఉండడం, తనభర్త కంటే అతను యువకుడిగా కనిపించడంతో రాఖీ అతనిపై మనసుపడింది.


Also Read:  ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..

ఆ తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరుచూ ధర్మేంద్ర ఇంటికి వస్తుండడంతో శత్రుఘన్ అతడిని వారించాడు. తాను లేనప్పుడు ఇంటికి రావద్దని ధర్మెంద్రను హెచ్చరించాడు. దీంతో ప్రేమికులైన రాఖీ, ధర్మేంద్రల వివాహేతర సంబంధం కొనసాగించడం కష్టపైపోయింది. మరి కొన్ని రోజుల తరువాత ఇద్దరూ బయట మార్కెట్లో తిరుగుతుండడం చూసిన శత్రుఘన్ తన భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఇదంతా సహించలేదని రాఖీ ఒక ప్లాన్ వేసింది. ధర్మెంద్ర తో కలిసి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు డిసెంబర్ 30న రాత్రి ఇంటికి వచ్చిన శత్రుఘన్ భోజనం చేసి పడుకున్నాడు. అయితే అతని భోజనంలో రాఖీ ఏదో మందు కలిపింది. మరోవైపుప పిల్లలు పక్క గదిలో పడుకొని ఉన్నాడు. అనుకోకుండా శత్రుఘన్ నిద్రలేచి తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఇంటి బయట ఉన్న ధర్మెంద్రకు రాఖీ ఫోన్ చేసి తమ ప్లాన్ ఫెయిల్ అయిపోతుందని చెప్పింది. ఆ తరువాత వెంటనే ధర్మెంద్ర తన తమ్ముడు అంకిత్ రాథోద్, స్నేహితుడు రంజీత్ తో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ ముగ్గురూ కలిసి శత్రుఘన్ ని ముఖంపై దిండు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

బయట వారి అరుపులకు పక్క గదిలో నిద్రిస్తున్న పిల్లలు నిద్రలేచారు. చూస్తే వారి పక్కనే రోజూ నిద్ర పోతున్న వారి తల్లి రాఖీ లేదు. బయట ఏదో గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పాప డోరు తీయడానికి ప్రయత్నించింది. కానీ గది తలుపులు బయటి నుంచి లాక్ చేసి ఉన్నాయి. రాత్రి అంతా గడిచిపోయింది. ఉదయం శత్రుఘన్ శవమై తేలాడు. తన భర్త గుండె పోటుతో మరణించాడని రాఖీ ప్రచారం చేసింది. కానీ పోస్టు మార్టంలో శత్రుఘన్ ఊపిరి ఆగిపోవడం వల్ల చనిపోయాడని తెలిసింది. దీంతో ఇది పోలీస్ కేసు అయింది. పోలీసులు విచారణ చేయగా.. శత్రుఘన్ కూతురు ఆ రాత్రి గది నుంచి పెద్దగా అరుపులు వచ్చాయని చెప్పేసింది.

పాప వాంగ్మూలంతో పోలీసులు ఆ ప్రాంతంలోని ఇళ్ల సిసిటీవి వీడియోలను పరిశీలించారు. అందులో శత్రుఘన్ ఇంటి నుంచి రాత్రి వేళ పారిపోతున్న ధర్మెంద్ర, అంకిత్, రంజీత్ లను పోలీసులు గుర్తించారు. వారిపై అనుమానంతో ధర్మెంద్ర గురించి ఆరా తీస్తే.. రాఖీ, ధర్మెంద్ర వివాహేతర సంబంధం గురించి పొరుగింటి వారు చెప్పారు. దీంతో పోలీసులు ధర్మెంద్ర, అంకిత్ లను అరెస్టు చేశారు. రంజిత్ పరారీలో ఉన్నాడు. రాఖీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని శత్రుఘన్ హత్య కేసు నమోదు చేశారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×