Crime news: కర్నాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అక్కడ ఉన్న కానిస్టేబుల్ బాధితురాలిని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ALSO READ: Rs.500 fake Notes : పొలంలో నోట్ల కట్టలు.. షాకైన రైతులు, ఇంతలో ఊహించని ట్విస్ట్
పోలీసుల వివరాల ప్రకారం.. ఓ మైనర్ బాలిక(17) బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఆ బాలికకు ఇంటి పక్కన ఉన్న యువకుడు విక్కీతో పరిచయం ఏర్పడింది. అయితే, విక్కీ ఆ మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనని మోసం చేశాడు. దీంతో బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పుకుంది. బాధితురాలి తల్లి బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ALSO READ: SBI Recruitment: శుభవార్త.. SBIలో 1194 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
అయితే, కేసు విచారణ సమయంలో కానిస్టేబుల్ అరుణ్ బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు న్యాయం చేస్తానని భరోసా కల్పించాడు. అంతేకాకుండా తనకు తెలిసిన వాళ్ల దగ్గర ఉద్యోగం కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఒక హోటల్ కు పిలిపించి కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి మత్తులోకి వెళ్లాక ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ALSO READ: UPSC Recruitment: గోల్డెన్ ఛాన్స్.. యూపీఎస్సీలో 752 ఉన్నత ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..
ఆ తర్వాత, విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని.. వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లితో చెప్పుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కానిస్టేబుల్ అరుణ్ తో పాటు విక్కీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ 14 రోజుల పాటు కస్టడీ కోసం పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.