E-Paper
Advertisement

Horoscope  Today February 2nd: ఆ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో అఖండ విజయం సాధిస్తారు  

Horoscope  Today February 2nd: ఆ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో అఖండ విజయం సాధిస్తారు  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 2న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బంధు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మిధున రాశి: ఈ రాశి వారు ఈరోజు అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. రుణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కుంభ రాశి: ఈ రాశి వారి మాటకు ఇవాళ ఇంటా బయట విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×