BigTV English

Ind vs Eng, 3rd T20I: చేతులెత్తేసిన బ్యాటర్లు.. రాజ్‌కోట్‌ లో టీమిండియా ఓటమి..!

Ind vs Eng, 3rd T20I: చేతులెత్తేసిన బ్యాటర్లు.. రాజ్‌కోట్‌ లో టీమిండియా ఓటమి..!

Ind vs Eng, 3rd T20I:  ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడవ టి20… భారత అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది. ఇవాళ రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో అనుహ్యాంగా ఇంగ్లాండ్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో టీమిండియా… దారుణ ఓటమి చవిచూసింది. మూడవ టి20 మ్యాచ్ లో ఏకంగా… 26 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా. దీంతో… 5 t20 ల సిరీస్ 2-1 తేడాతో… టీమిండియా ఇప్పటికి కూడా ఆదిత్యంలో ఉంది.


Also Read: Rohit Sharma: అమ్మ***నా బూతులు తిడుతున్నాడు.. గవాస్కర్ పై BCCI కి రోహిత్ శర్మ ఫిర్యాదు?

రెండు టీ20 లో గెలిచిన… ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కానీ… మూడవ టి20 లో లైట్ గా బ్యాటింగ్ చేశారు టీమిండియా బ్యాటర్లు. దీంతో టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్… ఎవరు కూడా రాణించలేదు. దీంతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో .. టీమిండియా చతికిల పడింది. ఈ మ్యాచ్లో… మరోసారి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చేతులెత్తేశాడు. కెప్టెన్సీ పరంగా దుమ్ము లేపుతున్న సూర్య కుమార్ యాదవ్… బ్యాటింగ్లో మాత్రం 360 డిగ్రీ మెరుపులు మెరిపించడం లేదు.


ఈ తరుణంలోని టీమిండియా భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ నెగ్గిన టీమిండియా… బౌలింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ లో… ఓపెనర్ గా వచ్చిన బకెట్ 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. మరో ఓపెనర్ సాల్టు ఐదు పరుగులకే మరోసారి నిరాశపరిచాడు.

ఆ తర్వాత లివింగ్‌స్టన్ 43 పరుగులతో రాణించగా కెప్టెన్ బట్లర్ 24 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో… బౌలర్లు కూడా కాస్త పరుగులు చేయడంతో… 171 పరుగులు చేసింది ఇంగ్లాండ్. వాస్తవానికి.. ఇంగ్లాండ్ 200కు పైగా పరుగులు చేస్తుందని రీతిలో బ్యాటింగ్ చేసింది. కానీ టీమిండియా బౌలర్లు… ఇంగ్లాండ్ ప్లేయర్లను కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి… 24 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా కూడా రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది. రీయంట్రీ ఇచ్చిన షమీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… టీమిండియా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నసపోయి 145 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయారు.

Also Read: Rohit Sharma: 5 రకాల మాంసం తింటున్న రోహిత్ శర్మ.. పంది కూర కూడా వదలడం లేదుగా ?

దీంతో… 26 పరుగుల తేడాతో మూడవ టి20 మ్యాచ్ లో ఘోర ఓటమిని చవి చూసింది ఈ టీమిండియా. టీమిండియా ప్లేయర్లలో అభిషేక్ శర్మ 24 పరుగులు చేసి పర్వాలేదనిపించిన… సూర్య కుమార్ యాదవ్ 14 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 18 పరుగులకు క్లీన్ బోల్డ్ అయ్యాడు. అయితే మిడిల్ ఆర్డర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం 40 పరుగులు చేసి గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ.. ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరగడంతో… టీమిండియా ఓడిపోవలసి వచ్చింది. ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో రెండు టీ20 లు ఉన్నాయి. ఇందులో ఒక్కటి గెలిచినా టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది.

Related News

IND VS WI: స్టేడియంలో ఘాటు రొమాన్స్‌…ప్రియుడి చెంప‌పైన కొట్టి మ‌రీ !

Sai Sudharsan: బౌండ‌రీ గేట్ ద‌గ్గ‌ర బ‌ర్గ‌ర్ తింటున్న సాయి సుద‌ర్శ‌న్‌…టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

CSK Srinivasan: మ‌హిళ‌ల క్రికెట్ తో రూపాయి లాభం లేదు..వంటింట్లో రొట్టెలు చేసుకుంటే బెస్ట్‌!

SAW vs BanW: నేడు బంగ్లా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌..ఎవ‌రు గెలిచినా టీమిండియాకు ప్ర‌మాద‌మే, పాయింట్ల‌ ప‌ట్టికే త‌ల‌కిందులు

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Big Stories

×