OTT Movie : కామెడీ జోనర్లో వచ్చే హారర్ సినిమాలను చూడటానకి, ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలలో దెయ్యాలు ఉన్నా స్టోరీ మాత్రం సరదాగా సాగిపోతుంది. బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇటువంటి మూవీ, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ స్టోరీ జానపద కథల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా ఓ వైపు భపెట్టిస్తూ , మరొ వైపు నవ్విస్తూ ఉంటుంది. ఈ బెంగాలీ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
సాయంతిక అనే జర్నలిస్ట్ ఒక స్టోరీ విని, దెయ్యాల గురించి పరిశోధన చేస్తుంటుంది. అప్పుడే ఆమె దెయ్యాలకు సంబంధించిన కొన్ని వస్తువులను విక్రయించే, ఒక ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ను కనిపెడుతుంది. ఆ పోర్టల్ మీద ఆసక్తితో, ఆమె ఒక పాత ‘బ్రహ్మదైత్య’ (బెంగాలీ జానపద కథల్లోని ఒక దెయ్యం) ను ఆర్డర్ చేస్తుంది. ఆశ్చర్యంగా మరుసటి రోజు ఉదయం ఒక పాత ఇనుప సందూకం, ఒక టేప్ రికార్డర్, ఒక బోన్సాయ్ బనియన్ చెట్టు (బ్రహ్మదైత్య ఆత్మలు సాధారణంగా బనియన్ చెట్లలో నివసిస్తాయని చెప్పబడుతుంది) ఆమె ఇంటికి డెలివరీ అవుతాయి. మొదట్లో సాయంతిక దీనిని ఒక జోక్‌గా భావిస్తుంది. వాటితో ఆడుకోవాలని అనుకుంటుంది.
అయితే అదే సాయంత్రం నుండి ఆమె అపార్ట్‌మెంట్‌లో, వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. బ్రహ్మదైత్య ఆత్మ అక్కడ తన శక్తిని ప్రదర్శిస్తుంది. సాయంతిక అక్కడ జరిగే సంఘటనలకు భయపడి పోతుంది. ఆమె ఆ దెయ్యాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్లాన్ వేస్తుంది. చివరికి ఆమె ఈ దెయ్యాన్ని అదుపు చేయగలదా ? లేక తన ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుందా ? ఆమె దెయ్యాన్ని అంతం చేయడానికి వేసే పాన్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బెంగాలీ కామెడీ హారర్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ ‘ఠాకూర్మార్ ఝూలి’ అనే ప్రసిద్ధ బెంగాలీ జానపద కథలను ఆధారంగా చేసుకుని రూపొందింది. ఆన్‌లైన్ షాపింగ్ వంటి ఆధునిక అంశాలను జోడించి, హారర్, కామెడీ జోనర్లో ప్రేక్షకులను ఈ మూవీ బాగా అలరించింది.
Read Also : ఒక్క పచ్చబొట్టుతో రాజకీయమే అతలాకుతలం… పిచ్చెక్కించే బెంగాలీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
హోయిచోయ్ (Hoichoi) ఓటీటీలో
ఈ బెంగాలీ కామెడీ హారర్ మూవీ పేరు ‘బ్రహ్మదైత్య’ (Brahmadaitya). 2020 లో వచ్చిన ఈ మూవీకి అభిరూప్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో సాయోని ఘోష్, రుద్రనీల్ ఘోష్, సౌమన్ బోస్ అనింద్య చటర్జీ, సౌరవ్ సాహా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ హోయిచోయ్ (Hoichoi) ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీ బెంగాలీ జానపద కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది.