Big Stories

Mercury Transit 2024: ఏప్రిల్ 4న మేషరాశిలో బుధుడు.. ఆ రాశులపై ప్రతికూల ప్రభావం!

Mercury Transit 2024
Mercury Transit 2024

Mercury Transit 2024: ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. మేథస్సుకు కారకుడిగా భావించే బుధుడు ఏప్రిల్ 4న మేషరాశిలో అస్తమించబోతున్నాడు. ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం..

- Advertisement -

రాశులపై బుధుడి ప్రభావం..
ఒక వ్యక్తి జీవితంపై గ్రహాలు చాలా ప్రభావం చూపుతాయి. తొమ్మిది గ్రహాల్లో బుధుడిని తెలివితేటలకు, జ్ఞానానికి కారకంగా పరిగణిస్తారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్న వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. అలాంటి వ్యక్తి తన కెరీర్‌లో పెద్దగా విజయం సాధించలేడు.

- Advertisement -

త్వరలో బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు.  2024 ఏప్రిల్ 4న ఉదయం 10.36 గంటలకు బుధుడు మేషరాశిలో అస్తమిస్తాడు. ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రాశుల వారికి ఈ మార్పు వల్ల కెరీర్‌లో సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ రాశులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

కన్య రాశి..
కన్యా రాశి వారికి బుధుడు దృష్టి లోపాన్ని కలిగిస్తాడు. దీని కారణంగా వారు ఉద్యోగంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరధ్యానం కారణంగా అసంపూర్తిగా పని చేస్తే ఆందోళన పెరుగుతుంది. కన్య రాశి వారు పని విషయంలో ఒత్తిడిని అనుభవిస్తారు. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారు కొత్త ఆలోచనలు చేయడంలో కూడా ఇబ్బంది పడతారు.

Also Read: మీన రాశిలో రాహు-శుక్రుల కలయిక.. ఈ రాశుల వారికి సిరిసంపదలు..

వృషభ రాశి..
వృషభ రాశి వారు కూడా బుధుడు మారడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మార్పు కారణంగా వృషభ రాశి వారు తమ భుజాలపై అదనపు పని భారాన్ని మోయాల్సి ఉంటుంది. దీని కారణంగా ఒత్తిడికి గురవుతారు.

కర్కాటక రాశి
ఈ రాశి మార్పు కర్కాటక రాశి వారికి చాలా సమస్యలను సృష్టిస్తుంది. పనిపై ఆసక్తి చూపరు. దీని కారణంగా వారు పైఅధికారుల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.

మేష రాశి..
బుధుడు రాశిలో మారడం వల్ల కూడా మేష రాశి వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మార్పు కారణంగా మేష రాశి వారు ఉద్యోగం మారాలని ఆలోచిస్తారు. దీని కారణంగా వారు పనిపై శ్రద్ధపెట్టలేరు. అయితే ఈ కాలంలో పనిలో మార్పులు చేయడం మానుకోవాలి.

Also Read: Saturn Transit 2024: శని రాశిలో శత్రు గ్రహాల సంయోగం.. ఈ రాశులకు ధన లాభం..

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కూడా ఈ మార్పు శ్రేయస్కరం కాదు. ధనుస్సు రాశి వారు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. దీని కారణంగా వారు ఉద్యోగం వదిలివేయాలని భావిస్తారు. పెరిగిన టెన్షన్ కారణంగా సహోద్యోగులతో గొడవలు కూడా జరగవచ్చు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News