Tirumala Alipiri steps: తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఈ తప్పు అస్సలు చేయకండి. ఈ తప్పు చేశారంటే స్వామి వారి దర్శనం చేసుకున్నా.. మీకు ఆ స్వామి ఆశ్శీస్సులు మాత్రం అసలు ఉండవంటున్నారు పండితులు. అలాగే మెట్ల మార్గంలో వెళితే కలిగే ప్రయోజనాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అఖలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరిన కోరికలు తీరుస్తూ.. భక్తుల పాలిట కొంగు బంగారంలా మారిన ఏడుకొండలవాడి దర్శనానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. దేశంలోనే రిచ్చెస్ట్ గాడ్‌గా పేరు గాంచిన తిరుమలేశుడి దగ్గరకు భక్తులు మూడు మార్గాల ద్వారా వెళ్తుంటారు. అలిపిరి నుంచి రోడ్డు మార్గంలో ఒక దారి అయితే.. అలిపిరి నుంచే మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్లడం రెండోది. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇలా అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ వెళ్లే భక్తుల కోసం టీటీడీ స్పెషల్ దర్శనం టోకెన్లు ఇస్తుంది. ఈ టోకన్లు తీసుకుని వెళ్లిన భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా అవుతుందని చెప్తుంటారు. అయితే ఇదంతా భౌతికంగా జరిగేది మాత్రమేనని మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు తెలియని సూక్మమైన విషయం మరొకటి ఉందని పండితులు చెప్తున్నారు. అది సాక్ష్యాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే నిర్దేశించిన షరతు అంటున్నారు. అందుకే మెట్ల మార్గంలో వెల్లే భక్తులు సంపూర్ణంగా స్వామి దర్శనం కావాలంటే ఆ శ్రీనివాసుడు నిర్దేశించిన షరతు పాటించాలంటున్నారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు కంటికి కనిపించని అద్బుతం జరుగుతుందట. ఈ రెండు మార్గాల్లో ప్రతి మెట్టుకు ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారట. వీరంతా అదృశ్య రూపంలో అక్కడ ఉండి స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడిని గమనిస్తుంటారట. అసలు వాళ్లు అలా మెట్ల దగ్గర ఉండటానికి వెంకటేశ్వర స్వామే కారణం అని ఆయన పెట్టిన షరత్తు వల్లే వైష్ణవ దూతలు మెట్ల దగ్గర ఉండిపోయారని పండితులు చెప్తున్నారు.
పూర్వం వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగే.. మనుసులతో పాటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడానికి పోటీ పడేవారట. దీంతో వైష్ణవ దూతలు మనుషుల కన్నా ముందే స్వామి వారిని చేరుకుని దర్శనం చేసుకునే వారట. రోజంతా స్వామివారి దర్శన సమయం వైష్ణవ దూతలకే సరిపోయేదట. ఇలా ప్రతి రోజు వైష్ణవ దూతలు మాత్రమే దర్శనం చేసుకోవడం మనుషులకు స్వామి దర్శనం దొరక్కపోవడంతో మనుషులకు కూడా స్వామి దర్శన భాగ్యం కలిగించాలని ఆ ఏడుకొండల వాడు వైష్ణవ దూతలకు ఒక షరతు పెట్టాడట.
ఎవరైతే భక్తులు తన నామాన్ని నిష్కల్మషంగా, మనఃస్పూర్తిగా స్మరిస్తూ కొండ మీదకు వస్తారో ఆ భక్తుల జపాన్ని ఏ వైష్టవ దూత వింటాడో అతను మాత్రమే తనను దర్శించుకోవాలని ఆ శ్రీనివాసుడు షరతు పెట్టడంతో.. అప్పటి నుంచి వైష్ణవ దూతలందరూ మెట్లకు ఇరువైపుల నిలబడి అలాంటి నిజమైన నిష్కల్మషమైన భక్తుడి కోసం ఎదురుచూడటం మొదలు పెట్టారట. ఏ భక్తుడైతే స్వామి వారిని మనఃస్పూర్తిగా స్మరిస్తూ.. కొండెక్కుతాడో అతని చుట్టు వందలాది మంది వైష్ణవ దూతలు చేరి.. ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ కొండ మీదకు తీసుకెళ్లి.. స్వామి వారి దర్శనం అయ్యే వరకు అతని వెంటే ఉండి.. వాళ్లు కూడా స్వామి వారి దర్శనం చేసుకుని ఆ భక్తుడికి కొండ మీద ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుని.. ఇక ఆ భక్తుడు తిరమల నుంచి తిరిగి కొండ దిగేదాకా కాపాడుతూ అతనికి మంచి జరగాలని దీవించి పంపిస్తారట.
ఇక ఆలస్యం ఎందుకు మీరు ఈసారి తిరుమలకు వెళితే స్వామి వారి దర్శనానికి మెట్ల మార్గంలో మాత్రమే వెళ్లండి. స్వామి వారి నామాలను మనఃస్పూర్తిగా జపిస్తూ.. వైష్ణవ దూతల ఆనుగ్రహాన్ని పొందండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి వారి దర్శనం చేసుకోండి. ఆయన కృపకు పాత్రులు కండి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్