BigTV English

JACK Movie :జాక్ ఫ్రాంచైజీ.. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మొత్తం ఈ మూవీకేనా..?

JACK Movie :జాక్ ఫ్రాంచైజీ.. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మొత్తం ఈ మూవీకేనా..?

JACK Movie :ఈ మధ్యకాలంలో ఫ్రాంచైజీలు ఎక్కువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా దర్శకులు ఒక సినిమా పూర్తి చేసేలోపే ఆ సినిమాకి కంటిన్యూగా రెండు, మూడు సినిమాలు చేస్తూ అదే సినిమాల కోసం తమ కెరియర్ ను అంకితం చేస్తున్నారు. ఇప్పటికే హిట్ ఫ్రాంచైజీలో సరికొత్త క్రైమ్ మిస్టీరియస్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వీటితోపాటు ఎన్నో ఫ్రాంచైజీలు ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ జానర్ ల్లోకి జాక్ మూవీ ని కూడా చేర్చబోతున్నారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)..


జాక్ ఫ్రాంచైజీ.. ఏకంగా మూడు సినిమాలు..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. జాక్ మూవీ కూడా ఫ్రాంచైజీ తరహాలోనే మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా జాక్ ఫ్రాంచైజీ నుండీ మొత్తం మూడు సినిమాలు రాబోతున్నాయి. జాక్ ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఆ తర్వాత జాక్ ప్రో, జాక్ ప్రో మ్యాక్స్ మూవీలకు సంబంధించిన స్టోరీలు కూడా నా దగ్గర ఉన్నాయి అంటూ బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు. మొత్తానికైతే బొమ్మరిల్లు భాస్కర్ కూడా జాక్ ఫ్రాంచైజీ లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఇదే మూవీ కోసం తన కెరీయర్ని సైతం అంకితం చేయబోతున్నారా అంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ జాక్ ఫ్రాంచైజీ తో మరో సరికొత్త యూనివర్స్ క్రియేట్ చేయబోతున్న బొమ్మరిల్లు భాస్కర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


Jack Movie: మెగా ప్రిన్స్ చేసిన పాపం సిద్దును చుట్టుకుందా..? ఫిలిం ఛాంబర్‌కి ఎక్కిన పంచాయితీ..!

జాక్ మూవీ విశేషాలు..

జాక్ మూవీ విషయానికి వస్తే.. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా , ప్రముఖ హీరోయిన్ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. తాజాగా ఈరోజు ఈ సినిమా నుండి ట్రైలర్ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతుందని చెప్పవచ్చు. ప్రముఖ నిర్మాత బాపినీడు దర్శకత్వంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో వీకే నరేష్ తో పాటు ప్రకాష్ రాజ్ అలాగే పలువురు సార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు. డీజే టిల్లుటిల్లు స్క్వేర్ వంటి సినిమాలలో సిద్దు జొన్నలగడ్డను చూసాము. అయితే ఈ రెండు చిత్రాలకు భిన్నంగా ఇప్పుడు జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే అవే బూతు మాటలు, అదే రొమాంటిక్ సన్నివేశాలు, అదే కామెడీను తీసుకున్నట్లు అనిపిస్తోంది. మొత్తానికి అయితే సరికొత్త యాంగిల్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సిద్దు జొన్నలగడ్డ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. బొమ్మరిల్లు భాస్కర్ విషయానికి వస్తే.. బొమ్మరిల్లు సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ఇదే సినిమాతో తన పేరును కూడా మార్చుకోవడం జరిగింది.ముఖ్యంగా ఈ సినిమా అందించిన విజయాన్ని గుర్తుగా ఈ సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్చుకొని చలామణి అవుతున్నారు. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన.. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు.పైగా తొలిసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఏప్రిల్ 10 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×