Ashu Reddy: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ, రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) బ్యూటీ, జూనియర్ సమంత (Junior Samantha)గా పేరు సొంతం చేసుకున్న ఆషు రెడ్డి (Ashu Reddy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. అంతేకాదు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం కాదని, ఇండియాకి వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఆషు రెడ్డి. ఒకప్పుడు పలు ఆల్బమ్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు పలు బుల్లితెర షోలలో సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఒక బుల్లితెర షోలో పాల్గొన్న ఆషు రెడ్డి అతడి మరణమే నన్ను మార్చేసింది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది.. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
JACK Movie :జాక్ ఫ్రాంచైజీ.. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మొత్తం ఈ మూవీకేనా..?
నన్ను అంత సీరియస్ గా ప్రేమించాడని అనుకోలేదు – ఆషు రెడ్డి
ప్రముఖ హీరో, కమెడియన్ సుధీర్ (Sudheer) హోస్ట్ గా చేస్తున్న షో ఫ్యామిలీ స్టార్. ఈ షోలో భాగంగా సుధీర్.. ఆషూ రెడ్డితో మీరు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నార అని అడగ్గా.. ఆమె ఎమోషనల్ అయింది. ఆషు రెడ్డి మాట్లాడుతూ… నేను ఒక అబ్బాయికి సారీ చెప్పాలనుకుంటున్నాను.. అసలు ఏమైందంటే ఒక అబ్బాయి నన్ను చాలా సిన్సియర్గా లవ్ చేశాను అని టెన్త్ లో ప్రపోజ్ చేశాడు. అయితే నేను కంప్లైంట్ చేశాను. అప్పట్లో ఆర్కుట్ అని ఒక సోషల్ మీడియా ఉండేది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆర్కుట్ కూడా ప్రొపోజ్ చేయడంతో అది మా పేరెంట్స్ కి, టీచర్స్ కి కూడా చూపించి కంప్లైంట్ చేశాను. ఇక డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒకరోజు అతడు చనిపోయారని కాల్ వచ్చింది. చివరిగా చూడడానికి రమ్మంటే వెళ్దాంలే అనుకున్నాను. కానీ వాళ్ళమ్మ కాల్ చేసి మరీ నువ్వు రావద్దు.. నిన్ను నిజంగా వాడు చాలా ఇష్టపడ్డాడు. నువ్వు జాయిన్ అయిన కాలేజీలోనే సీటు కోసం ఎంతో ట్రై చేశాడు. నీ నెంబర్ కోసం ఎంతగానో పరితపించాడు. అంత సీరియస్ గా లవ్ చేశాడు అని వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే అతని చివరి చూపుకు కూడా నేను వెళ్లలేకపోయాను. నిజంగా చెబుతున్నా అతడు అంత సీరియస్ గా నన్ను లవ్ చేశాడని అనుకోలేదు. అతనికి సారీ చెప్పాలి. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఇక అతని మరణమే నాలో చాలా మార్పు తీసుకొచ్చింది”అంటూ ఎమోషనల్ అయింది ఆషు రెడ్డి. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆషు రెడ్డి కెరియర్..
ఇకపోతే ఆషు రెడ్డి విషయానికి వస్తే.. టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూనే .. ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకునే ఈమె.. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి మరింత వైరల్ గా మారింది. అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో కాస్త ఓపెన్ గా మాట్లాడటం వల్ల సమాజంలో తన తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని తెలిపింది ఆషు రెడ్డి. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.